బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచికొడుతుండడం తో అనేక జిల్లాలు వరదమయంగా మారిపోయాయి. ఎక్కడిక్కడే వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లన్నింటికీ సెలవు ప్రకటించారు అధికారు. లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు సైతం జలమయమయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లన్నింటికీ సెలవు ప్రకటించారు అధికారు. లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు సైతం జలమయమయ్యాయి. ముఖ్యముగా భారీ వరదల నేపథ్యంలో ఎవ్వరు కూడా వంతెనలు, రోడ్లు దాటకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా వాగులు దాటుతూ ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటె విజయవాడలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. సింగ్ నగర్, ఏలూరు రోడ్, బందరు రోడ్ జలమయమయ్యాయి. మొగల్రాజపురంలో భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడి ఓ ఇంటిపై పడగా.. ఒకరు మృతిచెందారు. మృతురాలు 25 సంవత్సరాల మేఘనగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన యువకుడు చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. #heavyrainfall #andhrapradhesh #HashtagU pic.twitter.com/BG5LxOkWoS
— Hashtag U (@HashtaguIn) August 31, 2024
Read Also : Gudlavalleru Engineering College : నిందితులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా..?