Site icon HashtagU Telugu

Reels : ఉరివేసుకున్నట్లు రీల్ చేద్దాం అనుకున్నాడు..కానీ నిజంగానే ఉరిపడింది

Young Man Died While Making

Young Man Died While Making

ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు వదులుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో చోట యువకుడి మరణం..యువతీ మరణం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రతి ఒక్కరు రీల్స్ పిచ్చిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి..తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండి అంటూ మొత్తుకుంటున్నా యువత మాత్రం మారడం లేదు.

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. ఎవరి చేతుల్లో చూడు స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటీకే రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోగా ..మొన్నటికి మొన్న మహారాష్ట్ర లో ఓ యువతీ రీల్స్ చేస్తూ కొండపై కారు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో ఇంకా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగానే..తాజాగా ఓ యువకుడు ఉరివేసుకున్నట్లు రీల్ చేద్దాం అనుకున్నాడు..కానీ నిజంగానే ఉరిపడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సం పేట్ లో చోటుచేసుకుంది.

నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌ (23) స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. నిత్యం రీల్స్ చేస్తూ ఉండడం సరదా. ఈ క్రమంలోనే మంగళవారం హోటల్‌లో పని పూర్తి చేసుకున్న తర్వాత తన చిన్నక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లుగా రీల్‌ చేయాలని అనుకున్నాడు. ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ను సెట్‌ చేసుకుని.. దూలానికి ఉరితాడు వేశాడు. అనంతరం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఉచ్చు బిగుసుకుని నిజంగా ఉరిపడింది.

ఉరి బిగుసుకోవడంతో ఊపిరాడక అజయ్‌ మరణించాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు అజయ్‌ ఉరివేసుకుని కనబడటం చూసి షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అజయ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని అజయ్‌ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also : China Vs Philippines : గల్వాన్‌ను తలపించేలా.. గొడ్డళ్లతో ఆ సైనికులపై చైనా ఆర్మీ ఎటాక్