Site icon HashtagU Telugu

Monalisa Bhosle : మోనాలిసా ఇల్లు చూస్తే షాక్ అవుతారు..!

Monalisa House

Monalisa House

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా(Monalisa Bhosle)..గత పది రోజులుగా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లి కళ్లు, డస్కీ స్కిన్‌తో సెన్సేషన్‌గా మహాకుంభా మేళాలో మెరిసింది. సహజ సౌందర్యం, అమాయకపు చిరునవ్వుతో కుర్రకారును కట్టిపడేసింది. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం.. ఆ తర్వాత ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. దీంతో మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించేశారు.

Flexi War : కడపలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీల కలకలం

ఇటీవలె తన స్వస్థలానికి వెళ్లిన మోనాలిసా.. తాజాగా ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అందులో తన సోషల్ మీడియా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాకుండా తనను సపోర్ట్ చేస్తూ.. తనపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ మోనాలిసా థ్యాంక్స్ చెప్పింది. ఈ క్రమంలోనే తన గ్రామం, తన ఇల్లు గురించి వివరించింది. తమ కుటుంబం నివసించే ఇల్లు ఎలా ఉందో అందులో చూపించింది. అది మా సొంత ఇల్లు అని.. ఆ గ్రామంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారని పేర్కొంది. తాను మహా కుంభమేళాలో పూసల దండలు, రుద్రాక్షలు అమ్మడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లినట్లు పేర్కొంది. తాను సోషల్ మీడియాలో ఓవర్‌నైట్‌లో వైరల్ అయి.. సెలబ్రిటీని కావడంతో అక్కడ దండలు అమ్మడం కుదరలేదని వాపోయింది. ఒకానొక దశలో తనను కాపాడటం కూడా తన కుటుంబ సభ్యులకు కష్టంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీని కూడా ఎవరో హ్యాక్ చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన ఐడీని హ్యాక్ చేసిన తిరిగి ఇవ్వాలని.. తాను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంత సంపాదించాలనుకున్నానని మోనాలిసా వెల్లడించింది.

Exit mobile version