Site icon HashtagU Telugu

AP Temperature : చంద్రబాబు చెప్పింది ఇది..జగన్ ఇంకా నువ్వు మారవా..?

Jagan No Change

Jagan No Change

భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది మార్చి నుండి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవుతాయని హెచ్చరించడంతో, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అనుకూల సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. గతంలో చంద్రబాబు అధికారులను 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గించాలని ఆదేశించినట్లు పేర్కొంటూ కొన్ని వీడియో లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ చంద్రబాబు పై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోస్ లో చంద్రబాబు అన్నది ఏ సందర్భంలో అనేది బయటపడింది.

Vasthu Tips: వాస్తు ప్రకారం ఉసిరి చెట్టు ఇంట్లో ఏ దిశలో ఉండాలి? ఏ దిశలో ఉంటే మంచి జరుగుతుందో తెలుస

ఈ వీడియో 2018 మే నెలనాటి “నీరు-ప్రగతి” కార్యక్రమ సమీక్షలో చంద్రబాబు అన్నది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు నీటి సంరక్షణ, వృక్షారోపణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెద్ద ఎత్తున వృక్షారోపణ చేపట్టి నీటి నిల్వలను మెరుగుపరిచి, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటే ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు రావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఈ సందర్భాన్ని పూర్తిగా మార్చేసి ఆయన తక్షణమే ఉష్ణోగ్రతలను 10 డిగ్రీలు తగ్గించాలన్నట్లుగా వైసీపీ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం చూసిన యావత్ ప్రజలు , తెలుగు తమ్ముళ్లు , కూటమి శ్రేణులు వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఛీ కొట్టిన ఇంకా మీరు మారలేదా..? అని ఫైర్ అవుతున్నారు.