జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) వేడుకలు పిఠాపురంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ కి అస్త్రం గా మారాయి. పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం (Pithapuram ) ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ MLA, TDP నేత వర్మ(Pithapuram Varma)ను ఉద్దేశించే అన్నవని వైసీపీ సోషల్ మీడియా లో వైరల్ చేస్తూ..పవన్ బుద్ది ఇదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది.
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కరెంట్ షాక్‌ను కలిగిస్తాయా?
ఎన్నికల సమయంలో పవన్‌కు వర్మ సహాయపడగా, ఇప్పుడు ఆయనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ తీరు ‘తీరం దాటాక తెడ్డు తగలేసినట్లు’ ఉందని విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో వర్తు వర్మ అని, ఇప్పుడు ‘వారి కర్మ’ అని పవన్ వర్గం వ్యాఖ్యానించడాన్ని వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తోంది. పవన్ తన సహాయకులను కూడా వదిలేసే నాయకుడని, టీడీపీకి ఆయన ఎంతవరకు నమ్మదగిన వ్యక్తి అన్నదానిపై ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో మిశ్రమ స్పందన కలిగిస్తున్నాయి.