Site icon HashtagU Telugu

No Dress For Women : ఆ గ్రామంలో వింత ఆచారం..వివస్త్రలుగా మహిళలు…అన్ని రోజులు ఆలా ఉండాల్సిందే

Pini Village Women Still Do

Pini Village Women Still Do

ప్రపంచం రోజు రోజుకు ఎంతగానో అభివృద్ధి (Development) జరుగుతుంది. ప్రజలు సైతం ఎంతగానో డెవలప్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం పురాతనంగా మన పెద్దల దగ్గరి నుండి వస్తున్న ఆచారాలను ,సంప్రదాయాలను మాత్రం వదిలెయ్యకుండా అలాగే పాటిస్తూ వస్తున్నారు. కొన్ని ఆచారాలు , సంప్రదాయాలు చాల కొత్తగా, వింతగా ఉంటాయి. ఇలా కూడా చేస్తారా..ఉంటారా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ వారు మాత్రం ఎవరు ఆశ్చర్యపోయిన..నవ్వినా అవేమి పట్టించుకోకుండా సంప్రదాయాలను పాటిస్తుంటారు.

పర్యాటక ప్రాంతానికి ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) లోని పిని గ్రామం(Pini Village)లో ఓ వింత ఆచారం మాత్రం ఎప్పటి నుండో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణ మాసంలో ఓ ఐదురోజుల పాటు మహిళలు వివస్త్రలుగా (Womens No Dress) ఉంటారు. ఆ ఐదు రోజులు ఒంటిమీద నూలుపోగు కూడా ధరించారు. ఆ ఐదు రోజులు ఇంట్లో ఉంటారు. అలాగే ఈ ఐదు రోజులు సదరు మహిళలు తమ భర్తలను కన్నెత్తి చూడకూడదు..మాట్లాడకూడదు.. ఒకవేళ చూసినా నవ్వడం, మాట్లాడడం లాంటివి చేయకూడదు. ఇక మహిళలు ఈ నియమాలు పాటిస్తే.. ఇంట్లో ఉన్న పురుషులు తమ ఎదురుగా భార్య ఉన్నా అస్సలు మాట్లాడకూడదు. మద్యం, మాసం ముట్టకూడదు.. ఇంట్లో ఉన్నా లేనట్లే నడచుకోవాలి. అంతేకాదు కష్టమైన ఈ ఆచారాన్ని ఇష్టంగా విసుక్కోకుండా పాటించాలి. ఒకవేళ ఇలా పాటించకపోతే వారి కుటుంబానికి చివరికి తమ గ్రామానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఈ ఆచారం ఎలా..ఎప్పుడు వచ్చిదంటే..

ఒకప్పుడు ఈ ఊరిని రాక్షసులు బాధిస్తుండేవారట. వారు మనుషులను ఎత్తుకెళ్లకుండా కేవలం మహిళల దుస్తులను మాత్రమే చింపి తీసుకెళ్లేవారట. వారి పోరును భరించలేక వాళ్లు లహువా ఘోండ్ అనే దేవతను ప్రార్థించారు. వారు శ్రావణమాసంలో కొలిస్తే బాధ్రపదమాసం తొలివారంలో ఆ దేవత ప్రసన్నురాలై ఆ రాక్షసులను తుదుముట్టించందనీ, ఆ దేవతకు ఈతజ్ఈతా పూర్వకంగా ఉండడానికి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులు స్త్రీలు దుస్తులు ధరించకూడదు అనే నియమం మొదలైందని అక్కడి గ్రామస్థులు చెపుతున్నారు.

ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాదు ఈ ఐదురోజుల పాటు గ్రామస్తులెవ్వరూ బయటకు వెళ్లరు, బయట గ్రామవాసులు ఈ గ్రామంలోకి రారు. ఒకప్పుడు చాలా నిష్టగా ఈ ఆచారాన్ని పాటించేవారు అక్కడి మహిళలు. అయితే మారుతున్న కాలంతోపాటుగా ఇప్పుడిప్పుడే కాస్త మార్పు మొదలైంది. నేటికాలం వాళ్లు కనీసం చున్నీ అన్నా వేసుకుని ఈ ఆచారాన్ని పాటిస్తుండగా పాతకాలం వాళ్లు ఇంకా అదే పద్ధతిని అక్కడ కొనసాగిస్తున్నారు.

Read Also : MLC Kavitha: ఇక మహిళా లోకానికి మంచిరోజులు: లండన్ లో బ్రిడ్జ్ ఇండియా సమావేశంలో కవిత