Site icon HashtagU Telugu

Viral : ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న మహిళలు..

Delhi Metro Fight

Delhi Metro Fight

ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో (Delhi Metro) పేరు మీడియాలో మారుమోగిపోతుంది. ముఖ్యంగా మహిళలు చేసే చేష్టలకు మెట్రో ప్రయాణం అంటే అబ్బే అనేకడికి వస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యకరమైన దుస్తులు ధరించి మహిళలు ప్రయాణించడం, గొడవలు, కొట్లాటలు, దుర్భాషలాడడం, రీల్స్ చేయడం, ముద్దులు పెట్టుకోవడం ఇలా ఒకటేంటి..ఏది పడితే అది చేస్తూ మెట్రో పరువు తీస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు కఠిన చర్యలు చేపడుతూ వస్తున్నప్పటికీ..ప్రయాణికులు మాత్రం మారడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ..చిన్న చిన్నగా కొట్టుకునే దగ్గరికి వచ్చింది. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ముందు కాస్త నెమ్మదిగానే మొదలైన గొడవ రానురాను పెద్దయ్యింది. ఒకరిపై ఒకరు గొంతు పెంచుకుని అరుచుకోవడం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్న చాలా మంది యువతులు పక్కకు జరిగిపోయారు. ఈ తరుణంలో ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో మరోక మహిళ జోక్యం చేసుకుని ఇద్దరిని ఆఫేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తుంది.

Read Also : YS Jagan : వైజాగ్ ప్రజలు జగన్‌ను నమ్మలేదా..?