Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!

  • Written By:
  • Updated On - April 26, 2024 / 07:17 PM IST

Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్తించాడు.  డాక్టర్ గణేష్ శ్రీనివాసప్రసాద్ కార్డియోపల్మోనరీ రిసెసిటేషన్ (సీపీఆర్) ఇచ్చి ఆమె ప్రాణాలను కాపాడారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన డాక్టర్ ప్రసాద్ (36) బొమ్మసంద్రలోని నారాయణ హెల్త్ సెంటర్ లో నెఫ్రాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు.

డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. “ఆమె పల్స్ ను తనిఖీ చేసినప్పుడు, అది చాలా తక్కువగా ఉందని నేను గమనించా. ఆమె శరీరం నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు.  దీంతో నేను సిపిఆర్ చేశా. ఫలితంగా ఆమె పరిస్థితిలో మెరుగుదల కనిపించింది. ఎన్నికల డ్యూటీ సిబ్బంది వెంటనే ఆమెకు జ్యూస్ అందించి, అంబులెన్స్ ను పిలిపించి ఐదు నిమిషాల్లోనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. జాప్యం జరిగి ఉంటే ఆమెను కూడా కోల్పోవాల్సి వచ్చేదని ఆయన అన్నారు.