Site icon HashtagU Telugu

Elephant Video: ఏనుగును టీజ్ చేసిన మహిళ.. తొండంతో కొడితే దిమ్మతిరిగింది!

Viral

Viral

మనుషులకే (Humans) కాదు.. జంతువులకు (Animals) ఫీల్సింగ్స్ ఉంటాయి. ప్రేమ, కోపం, అప్యాయత లాంటి లక్షణాలు వాటికి ఉంటాయి. జంతువులే కదా ఏమాత్రం లైట్ తీసుకోవద్దు. జంతువులకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలిపే ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా అరటిపండ్ల గుత్తిని పట్టుకొని ఏనుగు (Elephant) దగ్గరకు వెళ్తుంది. అది చూసినా ఏనుగు వెంటనే ఆ మహిళ దగ్గరకు వస్తుంది. అయితే తన దగ్గర ఉన్న అరటి పండ్లు ఇవ్వకుండా మహిళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగును టీజ్ చేస్తుంది. అరటి పండ్ల కోసం వచ్చినా ఏనుగుకు పండ్లు ఇవ్వకపోవడంతో కోపం వస్తుంది. తన తొండంతో మహిళపై ఒక్క దెబ్బ వేయగానే ఎగిరి అవతల పడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వెరల్ (Viral) అవుతుంది. వీడియో ను చూసిన నెటిజన్స్ (Netizens) మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుతో ఆటలాడితే ఇలాగే ఉంటది మరి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Gaddar On KCR: గజ్వేల్ లో బరిలో గద్దర్.. కేసీఆర్ పై పోటీకీ సై!