Punjab: 73 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకు, కోడలు, మనవడు చిత్రహింసలకు గురిచేసి నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. లాయర్‌గా పనిచేస్తున్న కొడుకును సీసీటీవీ కెమెరా ఆధారాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆశా రాణి తన కొడుకు, కూతురు, కోడలుతో కలిసి పంజాబ్‌లోని రోపర్‌లో నివసిస్తుంది. తన భర్త గుండెపోటుతో చనిపోవడంతో కొడుకు వద్ద ఉంటున్నది. అయితే కొడుకు అంకుర్ వర్మ, అతని భార్య సుధ తనపై దాడి చేశారని బాధితురాలి తెలిపింది.మనవడు ఆశారాణి పరుపుపై నీళ్లు పోసి, ఆమె మంచాన్ని తడిపిందని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం చేశాడు. దీంతో తల్లిదండ్రులు అంకుర్ మరియు సుధ కలిసి ఆ స్త్రీని మంచం మీద పడుకోబెట్టి దాడి చేశారు. కుమారుడు తల్లి వీపుపై పదేపదే కొట్టాడు.విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆశారాణి ఇంటికి చేరుకుని ఆమెను రక్షించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
దీనికి సంబందించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. నవమాసాలు మోసి, పెంచిన తల్లిని కొట్టడం మహా పాపం అని కామెంట్స్ పెడుతున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
https://twitter.com/i/status/1718199603684839758
Also Read: Biden Home – Private Plane : బైడెన్ ఇంటి వద్ద కలకలం.. ప్రైవేటు విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్స్