Site icon HashtagU Telugu

Bengaluru : లేడీ ప్యాసింజర్‌ను అమ్మడానికి ట్రై చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్

'fake' Ola Cab

'fake' Ola Cab

మహిళలకు ఎక్కడ రక్షణ లేదని..ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారని..మహిళకు రక్షణ అనేదే కరవైందని దేశం మొత్తం మాట్లాడుకుంటుండగానే..వరుసగా మహిళలపై దాడులు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఇలా చట్టాలన్నీ ఎన్ని శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ లేడీ ప్యాసింజర్‌ను అమ్మడానికి ట్రై చేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

శనివారం రాత్రి 10:30 గంటలకు ఓ మహిళా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. ముందుగా ఆమె విమానాశ్రయం వద్ద ఉన్న ఓలా క్యాబ్ పికప్ స్టేషన్‌ వద్దకువెళ్లగా… అక్కడే ఉన్న ఓలా క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఎక్కించుకున్నాడు. కారు ప్రయాణం మొదలైన తర్వాత, డ్రైవర్‌ అనుమానాస్పద ప్రవర్తన మహిళకు అర్థమైంది. ఆమె ఎక్కడికి వెళ్లాలో చెపుతున్నప్పటికీ..సదరు డ్రైవర్ మాత్రం ఆమె మాటలను వినిపించుకోకుండా అలాగే ముందుకు వెళ్తున్నాడు. ఓలా యాప్‌లో వచ్చిన ఓటీపీ డ్రైవర్‌కు చెప్పినా అతను దాన్ని తన యాప్ లో ఎంటర్ చేసుకోలేదు. తన ఓలా యాప్ పని చేయడం లేదని చెప్పి, మహిళను తన ఫోన్‌లో డెస్టినేషన్‌ను ఎంటర్ చేయమని తెలిపాడు. అంతేకాకుండా, ఓలా యాప్‌లో చూపించిన రూ.1,300లకు బదులుగా, తన కారు సెడాన్ కాబట్టి రూ.1,500లు ఇవ్వాల్సి ఉంటుందని డ్రైవర్ డిమాండ్ చేశాడు. డ్రైవర్‌ ప్రవర్తన చూసి సదరు మహిళకు భయం వేసి..తనను ఎయిర్ పోర్ట్ కు తిరిగి తీసుకెళ్లామని చెప్పినప్పటికీ..అతడు వినిపించుకోలేదు.

కొంత దూరం వెళ్లిన తర్వాత కారును ఓ చోట ఆపి, తన పేమెంట్ యాప్ పని చేయడం లేదని చెప్పి, రూ.500 క్యాష్ ఇవ్వమని ఆమెను కోరాడు. డ్రైవర్ తీరును గమనించిన ఆమె వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఓలా క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి చేసి సదరు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సదరు మహిళా సోషల్ మీడియా లో తెలుపుతూ..మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Read Also : Cotton Purchases : రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన పత్తి కొనుగోళ్లు..అసలు ప్రభుత్వం ఉందా లేదా..? – హరీష్