Longest Female Mullet : వామ్మో.. ఇంత పొడవా ? పేద్ద జడతో వరల్డ్ రికార్డు !!

Longest Female Mullet : ఈమె శిరోజాలు చూడండి.. ఎంత పొడవున్నాయో కదా !!

Published By: HashtagU Telugu Desk
Longest Female Mullet

Longest Female Mullet

Longest Female Mullet : ఈమె శిరోజాలు చూడండి.. ఎంత పొడవున్నాయో కదా !! అమెరికాలోని టెన్నెసే రాష్ట్రంలోని నాక్స్‌విల్లేకు చెందిన 58 ఏళ్ల మహిళ తామి మానిస్‌.. ఈ ఏజ్ లోనూ ఇంత పొడవు జడను చక్కగా మెయింటెయిన్ చేస్తోంది. ఈమె జడ పొడవు ఎంతో తెలుసా ? 5.8 అడుగులు !! అందుకే ఈ మహిళ  ‘గిన్నిస్‌ బుక్’ వరల్డ్‌ రికార్డును సాధించింది. తామి మానిస్‌ అమెరికా ప్రభుత్వ నర్సుగా పనిచేస్తోంది.

Longest mullet - 172.72 cm (5 ft 8 in) on Tami Manis, USA 🇺🇸

ప్రతి దానికి ఒక ఇన్ స్పిరేషన్ ఉంటుంది. ఇంత పొడవు జడను పెంచేందుకు తామి మానిస్‌ లో ఇన్ స్పిరేషన్ ను రగిల్చేందుకు ఓ ఘటన కారణమైంది. అదేమిటంటే..  అమెరికన్‌ రాక్‌బ్యాండ్‌ కు సంబంధించిన ఓ వీడియోను చూసి ఆమె ప్రేరణ పొందింది. అందువల్లే  1980 నుంచి ఒక్కసారి కూడా తన జడను కత్తిరించుకోలేదని తామి మానిస్‌ చెప్పింది. తల ముందు భాగాన్ని మాత్రమే హెయిర్‌ స్టైల్ చేసుకుంటానని తెలిపింది. ప్రపంచ రికార్డు సాధించడంతో తామి మానిస్‌ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. తన జడ వెంట్రుకలను స్ట్రాంగ్ గా ఉంచేందుకు హస్క్‌ హెయిర్‌ ఉత్పత్తులను వాడానని చెప్పారు.

  Last Updated: 04 Sep 2023, 03:06 PM IST