Video Viral: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు.. బైక్ పై నుంచి దూకేసిన యువతి?

సమాజంలో ఆడవారికి రక్షణ అన్నది కరువవుతోంది. స్త్రీలకు ఇంట బయట ఎక్కడా కూడా స్త్రీలకు రక్షణ అనేది

Published By: HashtagU Telugu Desk
Video Viral

Video Viral

సమాజంలో ఆడవారికి రక్షణ అన్నది కరువవుతోంది. స్త్రీలకు ఇంట బయట ఎక్కడా కూడా స్త్రీలకు రక్షణ అనేది లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆడవారి కోసం ఎన్ని రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం కామాంధుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో కామాంధులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా 9 నెలల పసికందు నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఏ ఒక్కరిని విడిచి పెట్టడం లేదు.

సొంత తండ్రి కన్న అత్యాచారం చేయడం, తోడబుట్టిన అన్న చెల్లెలపై అత్యాచారం చేయడం లాంటి దారుణమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కేవలం అత్యాచారాలు మాత్రమే కాకుండా మానసిక వేధింపులు అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. దీంతో కొంతమంది ఆడపిల్లలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతుండగా మరి కొందరు మాత్రం ఆ కామాంధుల దెబ్బకు భయపడి కుమిలిపోతూ కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక యువతి బైక్ లో వెళ్తుండగా బయట నడుపుతున్న వ్యక్తి యువతితో తప్పుగా ప్రవర్తించడంతో వెంటనే స్పీడ్ గా వెళ్తున్న బయట నుంచి కిందకు దూకేసింది. అసలేం జరిగిందంటే.. కర్ణాటక బెంగళూరు లో కదులుతున్న బైక్‌ ట్యాక్సీపై నుంచి ఒక యువతి దూకేసింది. రైడర్‌ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రవర్తించడంతో పాటు మొబైల్ ఫోన్ కి ఓటీపీ వస్తుంది అని మొబైల్ తీసుకుని ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వెళ్లాల్సిన మార్గంలో కాకుండా దొడ్డబళ్లాపూర్ రోడ్డు వైపు బైక్‌ను తిప్పడంతో భయపడి పోయిన యువతి వెంటనే స్పీడ్ గా వెళ్తున్న బైక్ పై నుంచి కిందకు దూకేసింది. అయితే ఈ ప్రమాదంలో స్పల్ప గాయాలతో ఆమె బయటపడింది. స్థానికుల సహాయంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  Last Updated: 26 Apr 2023, 06:53 PM IST