Site icon HashtagU Telugu

Woman Died : ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి

Woman Falls 300 Feet Into V

Woman Falls 300 Feet Into V

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటీకే రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోగా ..తాజాగా ఓ యువతీ సైతం రీల్స్ చేస్తూ ప్రాణాలు వదిలింది. కొండపై కారు నడపడమే కాకుండా, రీల్స్ కోసం రివర్స్ తీస్తూ.. కొండ పైనుంచి కారుతో పాటు లోయలోకి పడిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ (ఛత్రపతి శంభాజీనగర్)లో సోమవారం (జూన్ 17) మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

శ్వేతా దీపక్ సుర్వాసే (23), సూరజ్ సంజౌ ములే (25) ఇద్దరు స్నేహితులు. వీరు సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్ నుంచి సులిభంజన్ హిల్స్‌కు వెళ్లారు. శ్వేతా దీపక్ సుర్వాసే (23) కారు డ్రైవింగ్ పూర్తిగా రాదు..అయినప్పటికీ డ్రైవర్ సీటులో కూర్చొని కారు నడుపుతున్నాగా..స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. నెమ్మదిగా రివర్స్‌ చేయడం చేసిన ఆమె…ఒక్కసారి స్పీడ్ గా వెనక్కు పొనిచ్చింది. ఆమె స్నేహితుడు సూరజ్‌ స్లో చేయమని పదేపదే హెచ్చరిస్తూ.. ‘క్లచ్, క్లచ్, క్లచ్.. నొక్కమని’ అరుస్తుంటాడు. కానీ ఆమె బ్రేక్ కు బదులు క్లచ్ ను మరింతగా తొక్కడంతో కారు కొండ ఫై నుండి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జఅవ్వగా..శ్వేతా దీపక్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. కళ్ల ముందు తమ స్నేహితురాలు ప్రాణాలు విడువడంతో అతడు తట్టుకోలేకపోయాడు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు చూసైనా రీల్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోండని అంటున్నారు.

Read Also : NEET Paper Leakage : 24 లక్షల మంది విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి – బల్మూరి వెంకట్