Delhi Metro: ఢిల్లీ మెట్రోలో నల్ల చీర కట్టుకుని అమ్మాయి రీల్స్

ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. సోషల్ మీడియా వ్యాప్తి ఎక్కువైనా తరువాత ఫెమస్ అవ్వాలన్న నెపంతో కొందరు పబ్లిక్ గానే తమ టాలెంట్ చూపించేందుకు ఇష్టపడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Delhi Metro

Delhi Metro

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో రీల్స్ చేసే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. సోషల్ మీడియా వ్యాప్తి ఎక్కువైనా తరువాత ఫెమస్ అవ్వాలన్న నెపంతో కొందరు పబ్లిక్ గానే తమ టాలెంట్ చూపించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఒక్కోసారి అది ఇతరులకు చికాకు పుట్టిస్తుంది. పబ్లిక్ గా డ్యాన్సులు, అందాల ఆరబోత చేయడం ఇతరులకు ఆటంకంగా మారుతుంది. మరి కొందరైతే ఏకంగా ముద్దులతో రెచ్చిపోతున్నారు. ఈ వీడియోలను చూసిన తర్వాత సోషల్ మీడియాలో ప్రజల ఆగ్రహం ఆకాశాన్ని తాకుతుంది.

ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరో వీడియో వైరల్ అవుతోంది. నల్ల చీరలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. అయితే డ్యాన్స్ బాగానే చేస్తున్నప్పటికీ అందాల డోస్ పెంచడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. మెట్రోలో కూర్చున్న ప్రయాణికులు చూసి నవ్వుతుండగా, మరికొందరు మొహం చాటేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ లో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై మెట్రో యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Renuka Chowdhury : ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలవబోతున్నాం – రేణుక

  Last Updated: 20 Nov 2023, 02:22 PM IST