Site icon HashtagU Telugu

Hyderabad : బస్సు కండక్టర్ ఫై మహిళ దాడి..

Woman Assaults Tsrtc Bus Co

Woman Assaults Tsrtc Bus Co

తెలంగాణ (Telangana) లో మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం పధకం పెట్టిన దగ్గరి నుండి కండక్టర్ల (Conductors)పై దాడులు ఎక్కువైపోతున్నాయి. ఓ పక్క ప్రవైట్ వాహన దారులు దాడులు చేస్తుంటే..మరోపక్క ప్రయాణికులు దాడులు చేస్తున్నారు. మా స్టేజ్ వద్ద బస్సు ఆపలేదని కొంతమంది..మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతావా అని మరికొంతమంది..బస్సు నెమ్మదిగా పోనిస్తావా అని ఇంకొందరు..ఇలా ఎవరు పడితే వారు బస్సు సిబ్బంది ఫై దాడులు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా..తాజాగా హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటిస్తూ ఏమి అనలేదు. ప్రస్తుతం ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : MLC Kavitha: పూలే విగ్రహ ఏర్పాటు కోసం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత