Site icon HashtagU Telugu

Viral Video : యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ‘బాబా బాలక్ నాథ్’..?

Baba Balaknath

Baba Balaknath

రాజస్థాన్లోని క్షేత్రపాల్ ఆలయ పూజారి ‘బాబా బాలక్ నాథ్’ (Baba Balaknath) అసభ్యకర వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే కూర్చున్న యువతిని (college student) బాబా ఇష్టం వచ్చినట్లుగా తాకుతూ..ఆమెను ఇబ్బందికి గురి చేసినట్లు వీడియో లో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ప్రసాదంలో మత్తు మందు కలిపి బాబా తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాబాతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలు ఏంజరిగిందంటే..

సదరు బాధితురాలు ..తన కుటుంబానికి చెందిన వ్యక్తితో కలిసి ఆలయానికి వెళ్లింది. అక్కడ, రాజేష్ అనే వ్యక్తి ఆమెను Baba Balaknath తో పరిచయం చేశాడు. ఆ తరువాత ఆమెతో స్నేహం చేస్తూ.. ఆమెను ఆలయానికి తరచూ ఆహ్వానించాడు Baba Balaknath. ప్రతి రోజు ఆమెకు ప్రసాదం అందించేవాడు. కాలేజీ కి వెళ్తున్న సదరు బాధిత యువతికి బాబా లిఫ్ట్ ఇచ్చాడు. కారు లో వెళ్తుండగా.. ఆమెకు మత్తు మందు కలిపినా ప్రసాదం ఇచ్చాడు..ఆ తర్వాత స్పృహ మూడు సార్లు అత్యాచారం చేసాడు. డ్రైవర్ యోగేష్ (Yogesh) ఈ సంఘటనను వీడియో తీసి, అది తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ బాధిత యువతిని బెదిరిస్తూ వచ్చాడు. రోజు రోజుకు వీరి బెదిరింపులు ఎక్కువ కావడం తో సదరు యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది. ప్రస్తుత కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Read Also : Free Gas : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు – మంత్రి నాదెండ్ల ప్రకటన