Site icon HashtagU Telugu

Property : నీ రక్తం తాగుతా అంటూ ఆస్తి కోసం తల్లిని హింసించిన కూతురు

Woman Caught On Video Bitin

Woman Caught On Video Bitin

ఇటీవల కాలంలో ఆస్తుల (Property ) కోసం సొంత అయినవారిని కాదు కన్నతల్లిదండ్రులను కట్టుకున్న భార్య , భర్తలను సైతం హతమారుస్తున్నారు. తాజాగా హర్యానా (Haryana) రాష్ట్రంలోని హిసార్ (Hisar ) జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన అందరినీ కలిచివేస్తోంది. మోడరన్ సాకేత్ కాలనీలో నివసించే రీటా అనే యువతి తన సొంత తల్లిని తీవ్రంగా హింసించింది. తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరుమీద రిజిస్టర్ చేయాలని కోరుతూ, ఆమెను చిత్రహింసలకు (harassment ) గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియోలో రీటా తన తల్లిపై దారుణంగా ప్రవర్తించిన తీరు అందరినీ షాక్‌కు గురిచేసింది. తల్లి తొడలను కొరుకుతూ కొడుతూ “నీ రక్తం తాగుతా” అంటూ బెదిరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తుంది. తల్లి నిస్సహాయంగా విలపించినప్పటికీ, ఆమె కనికరించలేదు. తల్లి ఎంత వేడుకున్నా, దండం పెట్టినా, ఆస్తి కోసం మానవత్వాన్ని మర్చిపోయి అమానుషంగా ప్రవర్తించింది. ఈ దాడిని బాధితురాలి కొడుకు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

Meenakshi Chaudhary: ‘మహిళా సాధికారత’ బ్రాండ్ అంబాసిడర్‌గా హర్యానా బ్యూటీ

ఈ ఘటనకు మూలకారణం రీటా భర్తకు సరైన సంపాదన లేకపోవడం అని తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం సంజయ్ పునియా అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి కాగా, పెళ్లి తర్వాత తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి కురుక్షేత్రలోని కుటుంబ ఆస్తులను విక్రయించి రూ. 65 లక్షలు సొమ్ము తన వద్ద ఉంచుకుంది. కానీ రీటా అంతటితో ఆగలేదు. ప్రస్తుతం తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని కూడా తన పేరుమీద రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. తల్లి నిరాకరించడంతో, ఆమెపై హింసాకాండకు దిగింది.

ఇలాంటి ఘటనలు సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా దిగజారుతున్నాయో చాటిచెబుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల కోసం తమ జీవితాన్ని అర్పించినా, కొంతమంది పిల్లలు ఆస్తుల కోసమే వాళ్లను హింసించడం బాధాకరం. హిసార్ ఘటన న్యాయ పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.