అప్పులు ఎక్కువైయని చెప్పి..ఇంట్లో నుండి వెళ్లిన భర్త..ఏడేళ్ల తర్వాత ఇంటికి వచ్చాడని తెలిసి ఆ ఇల్లాలు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్లి చూసేసరికి హిజ్రాగా వచ్చాడు..హిజ్రాగా మారిన భర్త ను చూసి షాక్ లో పడింది. ఈ ఘటన కర్ణాటకలోని రాంనగర్ లో చోటుచేసుకుంది.
రామనగరకు చెందిన లక్ష్మణరావు అనే యువకుడు స్థానికంగా ఒక కోడి మాంసం విక్రయించే దుకాణంలో పని చేసేవాడు. తల్లిదండ్రులు చూసిన యువతిని 2015లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ 2017లో లక్ష్మణరావు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
భర్త జాడ ఎక్కడా కనిపించకపోవడంతో లక్ష్మణరావు భార్య, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడి కోసం గాలించారు. అయినా అతడి ఆచూకీ ఎక్కడా లభించలేదు. దీంతో తల్లిదండ్రుల సహకారంతో తన ఇద్దరు కొడుకులతో కలిసి మనుగడ సాగిస్తోంది. ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోకు సంబంధించిన వీడియోలను టీవీలో చూస్తుండగా.. అందులోని కంటెస్టెంట్ అచ్చం తన భర్తలా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. తన అనుమానాన్ని నిర్దారించుకోడానికి మరోసారి ఆ వీడియోలను యూట్యూబ్‌లో చూసింది.
We’re now on WhatsApp. Click to Join.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తన భర్తేనని గురించి, ఐజూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కన్నడ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ ‘నీతు వనజాక్షి’ తన భర్తేనని తెలిపింది. కాగా, బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వనజాక్షికి మైసూరులో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. రష్మిక అనే హిజ్రా చేసిన రీల్స్‌లోనూ లక్ష్మణ్‌ను పోలిన హిజ్రా ఉంది. ఆ వీడియో ఆధారంగా రష్మికను ఐజూరు పోలీసులు సంప్రదించి, అందులోని వ్యక్తి ఆచూకీ ఆరాతీశారు.
‘ఆమె’ పేరు విజయలక్ష్మి అని చెప్పిన రష్మిక.. అడ్రస్ ఇతర వివరాలను అందజేసింది. దీంతో విజయలక్ష్మిని ఐజూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారించారు. తాను లక్ష్మణరావును కాదని, విజయలక్ష్మిని అంటూ గట్టిగా వాదించాడు. కానీ, అతడి ఒంటిపై ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో భార్య చెప్పడం, ఇతర గుర్తులను బయటపెట్టడంతో చివరకు తాను లక్ష్మణరావునని, లింగ మార్పిడి చేయించుకున్నానని ఒప్పుకున్నాడు. భార్యా, పిల్లలను వదిలి పెట్టి వెళ్లేందుకు మనసు ఎలా వచ్చేదని ప్రశ్నించగా? తనకు కుటుంబం కన్నా, హిజ్రా జీవితమే బాగుందని సమాధానం ఇచ్చాడు. కుటుంబంతో తిరిగి కలవడానికి నిరాకరించాడు.కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నా అతడు కరగలేదు.
Read Also : Vijay Political Party : రాజకీయ పార్టీ ప్రకటించిన సూపర్ స్టార్ విజయ్
