Site icon HashtagU Telugu

Wife Murder Husband : కట్టుకున్న పాపానికి మొగుళ్లను ఇంత దారుణంగా హత్యలు చేస్తారా..?

Mumbai Wife Hides Husbands

Mumbai Wife Hides Husbands

ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను హత్య చేసే సంఘటనలు అత్యంత భయంకరంగా మారుతున్నాయి. తమ అక్రమ సంబంధాలను కొనసాగించేందుకు కొందరు మహిళలు కన్నతండ్రి సమానమైన భర్తల ప్రాణాలను తీయడానికి పన్నే కుట్రలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. భార్యలు ప్రేమికుల ఒత్తిడికి లొంగి, భర్తలను హత్య చేయడమో, కుటుంబాన్ని మోసం చేయడం అనేది కామన్ గా మారింది. తాజాగా ముగ్గురు మహిళలు తమ భర్తలను అతి దారుణంగా చంపిన సంఘటనలు వెలుగుచూశాయి.

మొదటి సంఘటన ముంబై నలసోపారా ప్రాంతంలో చోటుచేసుకుంది. చమన్ దేవి అనే మహిళ తన భర్త విజయ్‌ను ప్రేమికుడి సహాయంతో హత్య చేసింది. భర్తను చంపిన తర్వాత, ఇంటి బెడ్‌రూమ్‌లోనే ఒక గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. దాని పైన కొత్త టైల్స్ వేయించి, ఎటువంటి అనుమానం రాకుండా చూసింది. అయితే 15 రోజుల తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు ఇంటికి రాగానే మారిన టైల్స్‌పై అనుమానం వచ్చి తవ్వితే, భర్త మృతదేహం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడగా వారు చమన్ దేవి, ఆమె ప్రేమికుడిని అరెస్టు చేశారు.

Pain in the Ankle : మీ అరిపాదంలో ఉన్నట్టుండి నొప్పి లేదా మంటగా అనిపిస్తుందా? ఇది దేనికి సంకేతమంటే?

ఇంకొక సంఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జరిగింది. సుష్మిత అనే మహిళ తన బావమరిది రాహుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త కరణ్ దేవ్‌ను హత్య చేసింది. మొదట భర్తకు 20-25 నిద్రమాత్రలు ఇచ్చి, మరణించకపోతే విద్యుత్ షాక్ ఇచ్చింది. ఈ హత్యా పథకం పూర్తిగా ఇన్‌స్టాగ్రామ్ మెసేజుల ద్వారా ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను బయటపెట్టిన దృక్కోణాలు విచిత్రంగా, భయంకరంగా ఉన్నాయి.

మూడో సంఘటన బీహార్‌లోని బార్వాన్ గ్రామంలో చోటుచేసుకుంది. గుంజా సింగ్ అనే మహిళ తన నిజమైన మామతో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహం జరిగిన 45 రోజులకే ఆమె తన భర్త ప్రియాంషును హత్య చేయడానికి మామతో కలిసి పథకం రచించింది. మామ గుండాల చేత భర్తను కాల్చిచంపించాడు. ఆమె మొబైల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిజాన్ని వెలికి తీశారు.

ఈ ఘటనలు ఒక్కొక్కటిగా చూస్తే, ప్రేమ అనే భావన ఎంత వికృతరూపం దాలుస్తుందో, కుటుంబాలపై ఇది ఎంతటి ప్రభావాన్ని చూపుతోందో స్పష్టంగా తెలుస్తోంది. అక్రమ సంబంధాల కోసం జీవిత భాగస్వాములను చంపే స్థాయికి వెళ్తున్న మహిళలు కేవలం శారీరక హింసే కాదు, సామాజిక, మానసిక భయాందోళనకు కూడా నిదర్శనంగా నిలుస్తున్నారు. వీటిని చూసి ప్రజలు “పెళ్లి” అనే సంస్కారంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.