Site icon HashtagU Telugu

Wife Beats Husband: వివాహేతర సంబంధం.. భర్తను భార్య ఎలా కొట్టిందో తెలుసా?

Kanpur Man

Kanpur Man

Wife Beats Husband: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. సంసారంలో నమ్మకం సన్నగిల్లుతున్న క్రమంలో భాగస్వామిని మోసంచేస్తూ మరో పార్ట్నర్‌తో శృంగారాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు చాలా మంది పురుషులు. భర్తలను మోసం చేస్తున్న ఆడ వారు కూడా అదే సంఖ్యలో పెరిగిపోతున్నారు. అయితే, వీటిని పసిగట్టిన సందర్భాల్లో మీడియాను పిలిచి రచ్చ చేయడం పరిపాటిగా మారిపోతోంది.

వివాహేతర సంబంధాలు అనేక మంది కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. చక్కటి సంసారంలో ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తోంది. క్షణకాల సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వివాహేతర బంధం పెట్టుకున్నాడనే అనుమానంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ అయిన భర్తను ఆయన భార్య చితకబాదింది. తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని నడిరోడ్డుపైనే పంచాయితీ పెట్టింది.

విచక్షణారహితంగా కొడుతూ హల్‌ చల్‌ చేసింది. పోలీస్‌ మొగుడుని రఫ్ఫాడించింది. ఈ ప్రక్రియను అక్కడున్న స్థానికులు సెల్‌ ఫోన్లలో బంధించారు. ఇంకేముందీ క్షణాల్లో సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌ అయిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం పార్క్‌లో అందరూ చూస్తుండగానే ఈ మహిళ తన పోలీసు భర్తను చెంపదెబ్బలు కొడుతూ రెచ్చిపోయింది.

ఇద్దరు భార్యలు.. ఇంకా అనేక మందితో…
పెళ్లాం చేతిలో చెప్పు దెబ్బలు తిన్నది కానిస్టేబుల్‌ దుర్గేష్‌గా గుర్తించారు. అతడిపై దాడి చేసింది రెండో భార్య అని పోలీసులు వెల్లడించారు. మొదటి భార్య ఉందనే విషయాన్ని దాచి రహస్యంగా తనను పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రెండో భార్య అతడిపై దాడికి దిగిందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందిందని, వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు భార్యలతో పాటు అనేక మంది మహిళలతో అతడికి వివాహేతర బంధాలు ఉన్నాయని రెండో భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Exit mobile version