Airport : ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..?

ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికి ఎయిర్ పోర్ట్ లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 11:39 AM IST

ప్రస్తుతం ప్రపంచం (World) రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి (Development) చెందుతుందో తెలియంది కాదు..అనేక దేశాలు (Countries) ఎంతో అభివృద్ధి చెందుతూ..ప్రపంచ పటంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇలాంటి ఎన్నో దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇప్పటికి ఎయిర్ పోర్ట్ (Airport) లేని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం. ఇప్పటికి కొన్ని దేశాల్లో ఎయిర్ పోర్ట్ లు అనేవి లేవు..అలానీ ఆ దేశాలు ఎలాంటి వ్యాపారాలు లేకుండా..ఎలాంటి అభివృద్ధి లేకుండా వెనుకపడలేదు..అనేక వ్యాపారాలు కొనసాగిస్తూ..రాణిస్తున్నాయి. అదేలా అనుకుంటున్నారా..? రైల్వే ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నారు.

ఇంతకీ ఎయిర్ పోర్ట్ (Airport) లేని దేశాలు ఏంటి అనేకదా..!!

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా పిలువడే వాటికన్ సిటీ లో ఇప్పటివరకు ఎయిర్ పోర్ట్ అనేది లేదు. ఇక్కడ జనాభా కూడా ఎన్నో కోట్లు కాదు జస్ట్ 825 మంది మాత్రమే. ఈ దేశంలో ఫ్లైట్‌ ల్యాండింగ్‌కు స్థలం గానీ, సముద్రం గానీ, నది గానీ లేవు. కేవలం రైలు మార్గం మాత్రమే ఉంది. దాని పక్కన ఉన్న దేశాల నుంచి కాలినడకన కూడా చేరుకోవచ్చు. ఈ జాబితాలో మరో దేశం మొనాకో. ఇది మూడు వైపులా ఫ్రాన్స్‌ దేశం కలిగి ఉంటుంది. ఐరోపాలో రెండవ అతి చిన్న దేశం. దీనికి సొంత విమానాశ్రయం లేదు. అందువల్ల ప్రజలు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల నుంచి మాత్రమే ఇక్కడికి వస్తారు. తర్వాత అక్కడి నుంచి పడవ లేదా క్యాబ్‌లో మొనాకో చేరుకుంటారు.

అలాగే ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటిగా చెప్పుకునే శాన్ మారినో. ఇటలీ చుట్టూ ఉన్న ఈ దేశానికి విమానాశ్రయం లేదు. సముద్ర మార్గం కూడా లేదు. ఇది ఇటలీకి చెందిన రిమిని ఎయిర్‌పోర్టు నుంచి ఇక్కడికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. ఎయిర్ పోస్ట్ లేని మరో దేశం లీచ్టెన్‌స్టెయిన్. ఇది 75 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి ప్రయాణించడానికి ప్రజలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి ప్రయాణం కొనసాగిస్తారు. దేశాల విస్తీర్ణం చిన్నగా ఉండటం వల్ల ఇక్కడ ఎలాంటి ఎయిర్‌పోర్టులు పెట్టే సదుపాయం లేకపోవడం ఇక్కడ ఎయిర్ పోర్టులు అనేవి లేకుండా పోయాయి.

Read Also : Amit Shah : అమిత్‌ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు