ఇంటిదొంగ (House Thief)ను ఈశ్వరుడైనా పట్టలేరంటారు..కానీ వాట్సాప్ స్టేటస్ (Whatsapp Status) ఇంటిదొంగను పట్టించింది. ముంబై (Mumbai)కి చెందిన జంట కు ఇంట్లో పనిచేసే పనిమనిషి భారీ షాక్ ఇచ్చింది. ఎంతో నమ్మకంగా ఉంటూనే..ఇంటికే కన్నం పెట్టి పారిపోయింది. రెండేళ్లుగా తమ ఇంట్లో పని చేయడానికి, పిల్లలను చూసుకోవడానికి పనిమనిషిని నియమించుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో, ఆమె అనుకోకుండా ఉద్యోగం మానేసింది, మరియు వారు ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం చేసుకోలేకపోయారు. దుర్గాపూజ సందర్భంగా గృహిణి తన కొత్త చీర కోసం వెతకగా, అది కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది. పనిమనిషిని పిలిచి అడగగా, ఇస్త్రీ చేసిన తర్వాత చీరను అల్మారాలో ఉంచానని చెప్పింది. అయినప్పటికీ, జంట సీసీటీవీ వీడియోలను పరిశీలించగా, పనిమనిషి ఇంటి నుంచి బ్యాగ్‌తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు.
ఆ తర్వాత కొన్ని రోజుల్లో, అదే చీరను కట్టుకుని పనిమనిషి వాట్సాప్ స్టేటస్‌లో ఫోటో పెట్టింది. అంతేకాకుండా, ఆ గృహిణికి చెందిన వాచీ కూడా ఆమె చేతిలో కనిపించింది. ఇది చూసిన తర్వాత దంపతులకు విషయం స్పష్టమైంది. వారు తమ ఇంటిని పూర్తిగా పరిశీలించగా, దాదాపు రూ.2.5 లక్షల విలువైన నగలు, వాచీలు, చీరలు, నగదు, మేకప్ కిట్‌లు, మరియు మరికొన్ని వస్తువులు మాయమైపోయినట్లు తెలిసింది. దీనిపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే వాట్సాప్ స్టేటస్ లు ఇలా కూడా ఇంటి దొంగలను పట్టిస్తాయని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Whatsapp status of house thief