Site icon HashtagU Telugu

PM Modi Speak ISRO Chief: దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో ఛీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!

PM Modi Speak ISRO Chief

Compressjpeg.online 1280x720 Image (2) 11zon

PM Modi Speak ISRO Chief: బుధవారం (ఆగస్టు 23) చరిత్ర పుటల్లో నమోదైంది. దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. భారతదేశం ఇప్పుడు చంద్రునిపై ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మిషన్ మూన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా విజయం సాధించింది. ఈ సందర్భంగా జోహన్నెస్‌బర్గ్‌ నుంచి ఇస్రో చీఫ్‌ ఎస్‌ సోమనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ (PM Modi Speak ISRO Chief) చేశారు.

ఇస్రో చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను దింపిన మొదటి దేశంగా ఇండియా అవతరించింది. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా నుంచి మిషన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నారు. ఆయన అక్కడ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ క్షణాన్ని ఆస్వాదించారు. ఇస్రో విజయంపై ఆయన మాట్లాడుతూ.. మెరుగైన భారత్‌కు ఇదే తరుణం అని అన్నారు.

Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతం.. మూన్ మిషన్‌ కోసం కసరత్తులు చేస్తున్న పలు దేశాలు..!

చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత దక్షిణాఫ్రికా నుంచి నేరుగా ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు మోదీ ఫోన్ చేశారు. నీ పేరు సోమనాథ్, నీ పేరు చంద్రుడితో ముడిపడి ఉంది. మీరు విజయం సాధిస్తారు. ఈ ప్రయాణంలో మీ ప్రతి భాగస్వామికి శుభాకాంక్షలు. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు, మీరు చరిత్ర సృష్టించారని ప్రధాని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ 4 రోజుల విదేశీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ సమయంలో మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్నాడు. ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి చారిత్రక ఘట్టాలను చూస్తుంటే గర్వంగా ఫీలవుతాం. ఇది నవ భారతదేశపు సూర్యోదయం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది.

చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన సందర్భంగా ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను, జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతి భారతీయ పౌరుడి మాదిరిగానే నేను కూడా చంద్రయాన్‌పై దృష్టి సారించానని ప్రధాని అన్నారు. ఈ క్షణాలు ఉద్విగ్నమైనవని, అపూర్వమైనవని, అద్భుతమైన క్షణాలని అన్నారు. ఈ విజయం 140 కోట్ల భారత ప్రజల హృదయ స్పందనలు అని వివరించారు. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉన్నదని వివరించారు.