Site icon HashtagU Telugu

Never Give Up: వెల్ డన్ గర్ల్.. కీప్ ఇట్ అప్, భారీ వర్షంలోనూ ఆగని పరుగు!

Running

Runner

అన్నీ అనుకూలిస్తే విజయం ఎవరైనా సాధిస్తారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం దక్కించుకుంటే ఆ గెలుపుకు ఓ లెక్కుంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఇటీవల కంబోడియాలో ఏషియన్ గేమ్స్ లో (Games) భాగంగా 5,000 మీటర్ల రన్నింగ్ పోటీలు జరిగాయి. అయితే రేస్ మొదలైన కొద్దిసేపటికీ కుండపోత వర్షం కురిసింది. అంతేకాదు పెద్ద పెద్ద మెరుపులు మెరుస్తూ భారీ వర్షం కురవడంతో క్రీడాకారిణులంతా భయపడిపోయారు. కానీ ఒక్క అమ్మాయి మాత్రం తగ్గేదేలే అంటూ ట్రాక్ పై దూసుకుపోయింది.

500 మీటర్ల పోటీలో ఇతర అమ్మాయిలు తప్పకున్నా కంబోడియా రన్నర్ (Woman Runner) సామ్నాంగ్ భారీ వర్షంలో పరుగులు పెట్టి సక్సెస్ గా టాస్క్ ను కంప్లీట్ చేసింది. భారీ వర్షం పడుతున్నా.. ఉరుములు ఉరుముతున్నా ఏమాత్రం భయపడకుండా తన లక్ష సాధన కోసం పరుగులు తీసింది. రేస్ కంప్లీట్ కాగానే ఎమోషన్ అయ్యింది. తనకు సపోర్ట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యావాదాలు తెలియజేసింది. ఆమె ప్రతిభను చూసిన నిర్వాహకులు భారీగా 10 వేల డాలర్లను రివార్డుగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 700,000 మంది ఈ వీడియోను చూశారు. “విజయాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు” అంటూ ఆమె స్ఫూర్తిని ప్రశంసించారు.

ఈ సందర్భంగా Ms Samnang మాట్లాడుతూ వర్షం గురించి తనకు తెలుసునని, అయితే ఇంత వర్షం పడుతుందని తనకు తెలియదని అన్నారు. “ఇది భారీ వర్షం తీవ్ర గాలులతో పాటు మెరుపులు కూడా వచ్చాయి” అని అథ్లెట్ చెప్పింది.  “నాకు ఉన్న ప్రేక్షకుల మద్దతు కారణంగా రేసును పూర్తి చేయడం నాకు చాలా ముఖ్యం కంబోడియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. రక్తహీనతతో బాధపడుతున్న ఈ విజయం మరిచిపోలేనిది’’ అంటూ Ms Samnang చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ (Viral) అవుతుండటంతో నెటిజన్స్ “వెల్ డన్ గర్ల్… కీప్ ఇట్ అప్!”అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Mem Famous Trailer: బర్త్ డే రోజు ఎవడైనా కేక్ కట్ చేయిస్తడు. కల్లు తాగిపిస్తాడా?

Exit mobile version