Site icon HashtagU Telugu

Ruturaj Gaikwad: రుతురాజ్ సిక్స్ అదుర్స్.. కారు డ్యామేజ్.. వీడియో వైరల్..!

Ruturaj Gaikwad

Resizeimagesize (1280 X 720) (1) 11zon

సోమవారం లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) హాఫ్ సెంచరీ సాధించాడు. చెపాక్ స్టేడియంలో రుతురాజ్ 31 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా గైక్వాడ్ నిలిచాడు.

అయితే.. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి సిక్స్ బాదాడు. అది కాస్తా స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన కారుకు తగిలి సొట్టపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుతురాజ్ దెబ్బ అదుర్స్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఓవర్ చివరి బంతిని గైక్వాడ్ ఎక్స్‌ట్రా కవర్ల మీదుగా సిక్సర్ బాదాడు. బంతి నేరుగా వెళ్లి స్పాన్సర్ కారు వెనుక డోర్ భాగాన్ని తాకింది. దింతో కారు డ్యామేజ్ అయింది.

Also Read: Delhi Capitals Vs Gujarat Titans: గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య టఫ్ ఫైట్.. నేడు మ్యాచ్ వీక్షించనున్న పంత్..?

రుతురాజ్ గైక్వాడ్ చెపాక్ స్టేడియంలో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో గైక్వాడ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 38 ఇన్నింగ్స్‌ల తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను వెనక్కి నెట్టాడు. ఐపీఎల్‌లో 38 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ 1371 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 1356 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 1248 పరుగులు చేయగా, సురేశ్ రైనా 1125 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.