Site icon HashtagU Telugu

Delhi Girl: ఇది మీ ఇల్లు కాదు.. మెట్రో రైలు, చక్కర్లు కొడుతున్న యువతి వీడియో!

Delhi Metro

Delhi Metro

ఢిల్లీ మెట్రోలో అనేక చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ప్రేమికులు మెట్రో ట్రైన్ లోనే రొమాన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్లు ఇద్దరు యువతులు మెట్రో రైలులో కొట్టుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే రెండు ఘటనలు మరిచిపోకముందే తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సర్కిల్ వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందంటే.. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ యువతి హెయిర్ స్ట్రెయిటనర్ ఉపయోగించడం చూడొచ్చు. ఇతర ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకుంటుంది. కానీ, సాటి ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన పని తాను చేసుకుంటు ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే 1.60 లక్షల లైక్‌ లు వచ్చాయి. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ఇది మెట్రో.. మీ ఇల్లు కాదు అంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.  ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో ఘటనలు హాట్ టాపిక్ మారడంతో పాటు వివాదస్పదమవుతున్నాయి.

https://twitter.com/HasnaZarooriHai/status/1670119257215238145?cxt=HHwWgoDUrbSnuq0uAAAA

Also Read: Strongest Beer: ఈ బీర్ చాలా డేంజర్ గురూ, ఒకేసారి తాగితే ఇక అంతే మరి!