Viral Video : తనను తానే కాటేసుకున్న పాము.. ఎంత పౌరుషమో చూడండి

ఎక్కడైనా పాము కనిపించిందంటే చాలు హడలిపోతుంటాం. కొందరైతే ఇళ్లలోకే పాములు వచ్చినపుడు తమ భద్రత కోసం వాటిని చంపుతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Viral Video snake bite her self

Viral Video snake bite her self

ఈ రోజుల్లో చాలా మంది మనుషులు.. తమ పరిస్థితులు, అవసరాలను బట్టి ఎదుటివారికి తలంచి బ్రతుకుతుంటారు. కానీ కొందరు మాత్రం ప్రాణం పోయినా సరే.. ఎవడికీ తలవంచేదే లేదు అన్నట్టుగా ఉంటారు. శక్తి ఉన్నంత వరకూ కష్టపడి బ్రతుకుతాం. ఎవడి దయా దాక్షిణ్యాలు అక్కర్లేదనేవారు కూడా ఉంటారు. అయితే మనుషుల కంటే జంతువులకే పౌరుషమెక్కువ. మరీ ముఖ్యంగా పాములకు(Snakes) పౌరుషం, పగ రెండూ ఎక్కువ. ఒక్కసారి దెబ్బతిన్న పాము.. తిరిగి వారిని కాటేసేవరకూ వదలదు.

ఎక్కడైనా పాము కనిపించిందంటే చాలు హడలిపోతుంటాం. కొందరైతే ఇళ్లలోకే పాములు వచ్చినపుడు తమ భద్రత కోసం వాటిని చంపుతుంటారు. అది చావకుండా బ్రతికిందా ఎదుటివారికి చావును చూపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటిదే. కానీ.. శత్రువు అనుకుని తనని తానే కాటేసుకుంది. అదెలానో మీరే చూడండి.

రక్తపింజర పాముని ఎవరో కర్రతో కొట్టినట్టున్నారు. ఆ వేటుకి దాని తల తెగిపడింది. తల తెగిపోవడంతో పాము శరీరం గిలగిల కొట్టుకుంటూ కాస్త పక్కకి వెళ్లింది. అది పాము తలకు తగలడంతో.. తనపై దాడిచేసిన శత్రువు అనుకుని కాటేసింది. అలా తనని తానే కాటేసుకున్న ఆ పాము వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 6 మిలియన్ల మందికి పైగా చూడగా.. 18.5 వేల మంది రీట్వీట్లు చేశారు. లక్షన్నరకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు భయంకరంగా ఉందంటే.. కొందరు నొకియా ఫోన్లో వచ్చే స్నేక్ గేమ్ నిజమే అని కామెంట్ చేస్తున్నారు.

 

Also Read :  Viral News : టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే.. నేరుగా బీచ్ లోకి తీసుకెళ్లింది

  Last Updated: 07 May 2023, 06:36 PM IST