Site icon HashtagU Telugu

Tractor Stunt Viral : ట్రాక్టర్ తో​ స్టంట్ చేసి..ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

Tractor Stunt

Tractor Stunt

ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం బాగా పెరగడం తో ఊరు , పేరు తెలియని వారు సైతం రాత్రికి రాత్రే పాపులర్ అవుతున్నారు. దీంతో చాలామంది పాపులర్ కావాలనే ఆశతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రన్నింగ్ ట్రైన్ లో నుండి విన్యాసాలు చేయడం..బైక్ తో స్టంట్ (Bike Stunt)చేయడం..మరెన్నో విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా పంజాబ్ (Punjab) లో 29 ఏళ్ల యువకుడు ట్రాక్టర్ తో​ స్టంట్ (Tractor Stunt) చేసి..చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

పంజాబ్​లోని గుర్దాస్​పూర్ (Gurdas pur)​ జిల్లాలో శనివారం రాత్రి ఓ స్పోర్ట్స్​ ఈవెంట్​ ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో సుఖ్​మన్​దీప్​ సింగ్ (Sukhmandeep Singh) (29)​ అనే వ్యక్తి పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ట్రాక్టర్​ స్టంట్​ చేసేందుకు సుఖ్​మన్​దీప్​ సింగ్​ సిద్ధమయ్యాడు. ముందుగా ఇంజిన్​ ఆన్​లో పెట్టి, ట్రాక్టర్​ను ముందు రెండు చక్రాలను పైకి లేపారు. ఇంజిన్​ ఆన్​లోనే ఉండటంతో అది అటు, ఇటు రౌండ్స్​ కొట్టడం మొదలుపెట్టింది. అలా ప్రమాదకరంగా తిరుగుతున్న ట్రాక్టర్​పై ఎక్కేందుకు ట్రై చేసి..కింద పడిపోయాడు. ఆ వెంటనే అతని మీద నుంచి ట్రాక్టర్​ వెళ్లింది. దీంతో అతడు ప్రాణాలు పోయాయి. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు కెమెరాలో వీడియో తీసి , సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో వైరల్ గా మారాయి. ఇదే కాదు చాలామంది యువకులు పెద్ద ఎత్తున బైక్ స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇవి చూసిన తర్వాత కూడా యువకుల్లో మార్పు రావడం లేదు.

Read Also : Vijay Devarakonda: యూత్ పెద్ద కలలు కనాలి, విజయం సాధించాలి: ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ

https://twitter.com/porusofpanjab/status/1718527908246118720?