Site icon HashtagU Telugu

Cow And Snake: ఆవుతో పాము సయ్యాట.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో

Viral

Viral

Cow And Snake: ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆవు, పాము కలిసి ఆడుకునే ద్రుశ్యాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ సంఘటన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద పంచుకున్నారు. 17 సెకన్ల వీడియో ఒకటి ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. గోధుమ రంగులో ఉన్న ఆవు, బుసలు కొట్టే పాముతో ఆడుకోవడం చూడొచ్చు. వాటి మధ్య ఎలాంటి భయం కానీ, అభద్రతా భావం కానీ లేదు. మిస్టర్ నందా వీడియోను షేర్ చేస్తూ, “వివరించడం కష్టం. స్వచ్ఛమైన ప్రేమ ద్వారా లభించిన నమ్మకం” అంటూ రియాక్ట్ అయ్యారు.

ఆవు, పాము ప్రవర్తన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది గత 15 గంటల్లో దాదాపు 3 లక్షల వ్యూస్ సాధించింది. దాదాపు 5,000 లైక్‌లను పొందింది. “ప్రకృతి సంక్లిష్టమైనది. మీరు అనుభవం ద్వారానే ప్రకృతిని అర్థం చేసుకోగలరు. ప్రకృతిని వివరంగా చూడటం నాకు చాలా ఇష్టం అంటూ మరొకరు కామెంట్ చేయగా, నేటి ప్రపంచంలో, మానవత్వం ఈ మనోహరమైన ఆత్మల నుండి నేర్చుకోవాలి” అంటూ స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను మీరు కూడా చూసేయ్యండి మరి.

Also Read: Nani: నానికి బంపరాఫర్, రజనీ మూవీలో ప్రత్యేక పాత్ర ఆఫర్!