Site icon HashtagU Telugu

Vemula Veeresham : న్యూ** వీడియో కాల్ ఘటనపై MLA వేముల వీరేశం రియాక్షన్

Vemula

Vemula

సైబర్ నేరగాళ్ల (Cyber ​​Criminals) ఆగడాలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) ను టార్గెట్ చేసారు. ఆయనకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్ చేసి, దాన్ని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోను కుటుంబసభ్యులకు, మిత్రులకు పంపిస్తామని, ఇంకా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని తీవ్రంగా కలవరపరిచింది.

 

Singer Kalpana: వెంటిలేటర్ పై సింగర్ కల్పనా.. హాస్పిటల్ కు చేరుకున్న గాయని సునీత!నిన్న రాత్రి తెలియని నంబర్ నుంచి వచ్చిన వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే, అవతలి యువతీ నగ్నంగా కనిపించింది. వెంటనే ఆయన అప్రమత్తమై ఫోన్ కట్ చేసినప్పటికీ, అప్పటికే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా దృశ్యాలు రికార్డు చేయబడింది. అనంతరం ఈ వీడియోను ఎమ్మెల్యేకు పంపించి, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే బెదిరిపోకుండా, వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “సైబర్ నేరగాళ్లకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరాలను అరికట్టడంలో మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి నేరాలను ఉపేక్షించబోము. నిందితులను పట్టుకుని, శిక్షించేలా చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.