Pune Shocker: పుట్టినరోజు కోసం దుబాయ్‌కు తీసుకెళ్లనందుకు దారుణం

తన పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు నిరాకరించినందుకు భార్య ముక్కుపై కొట్టడంతో 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోఈ ఘటన జరిగింది

Published By: HashtagU Telugu Desk
Pune Shocker

Pune Shocker

Pune Shocker: తన పుట్టినరోజు వేడుకల కోసం దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు నిరాకరించినందుకు భార్య ముక్కుపై కొట్టడంతో 36 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోఈ ఘటన జరిగింది .నిర్మాణ రంగంలో వ్యాపారి అయిన నిఖిల్ ఖన్నా రేణుక (38)ను ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు .రేణుక పుట్టినరోజు జరుపుకునేందుకు నిఖిల్ దుబాయ్‌కు తీసుకెళ్లకపోవడం, పుట్టినరోజు, వార్షికోత్సవానికి ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిఖిల్‌ నుంచి సరైన స్పందన రాకపోవడంతో రేణుక మనస్తాపానికి గురైంది.ఆ గొడవలో రేణుక నిఖిల్ ముఖంపై కొట్టిందని పోలీసులు తెలిపారు. బలంగా తగలడంతో నిఖిల్ ముక్కు, పళ్లు దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావంతో నిఖిల్ స్పృహ కోల్పోయాడు.దీంతో మృతి చెందాడు. రేణుకపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అరెస్ట్ చేశారు.

Also Read: Vanabhojanalu: వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా.. దాని విశిష్టత ఇదే

  Last Updated: 25 Nov 2023, 03:12 PM IST