Haridwar : గంగ నదిలో ముంచితే బ్లడ్ క్యాన్సర్‌ తగ్గుతుందనే మూఢనమ్మకంతో పిల్లాడ్ని చంపేశారు

  • Written By:
  • Updated On - January 25, 2024 / 12:54 PM IST

చంద్రుడిపై తొలి అడుగు మోపి ఇండియా చరిత్ర తిరగరాస్తున్న..ఇంకా చాల చోట మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు తీయడం చేస్తున్నారు. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కొంతమంది ప్రజలు మాత్రం మూఢ నమ్మకాలను పాటిస్తూ వస్తున్నారు. తాజాగా బ్లడ్ క్యాన్సర్‌ తగ్గుతుందనే మూఢనమ్మకంతో గంగ నదిలో పిల్లాడ్ని ముంచి ప్రాణాలు తీసిన ఘటన హరిద్వార్‌లోని హర్‌కీ పౌరిలో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం బుధవారం తమ 5 ఏళ్ల చిన్నారితో కలిసి హర్ కీ పౌరీకి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారు చిన్నారిని గంగానదిలో స్నానానికి తీసుకువెళ్లారు. వారి గుడ్డి నమ్మకంతో, గంగానదిలో పదేపదే ముంచారు. చివరకు ఊపిరి ఆడక ఆ పిల్లాడు మరణించాడు. గత కొద్దీ రోజులుగా ఐదేళ్ల పిల్లాడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గంగానదిలో మునిగితే క్యాన్సర్ తగ్గిపోతుందంటూ స్థానికులు చెప్పడం తో ఆ పని చేసి బ్రతుకున్న పిల్లాడ్ని చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Read Also : Akhil : సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ ఎందుకు.. అసలు స్టోరీ ఇది.. హోంబలె తో అఖిల్ మూవీ డైరెక్టర్ కూడా..!