US Dog: అతి పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డు సృష్టించిన కుక్క.. ఫోటోస్ వైరల్?

సాధారణంగా చాలామంది ఇంట్లో అనేక రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది పెంచుకునే జంతువులలో కుక్క కూడా ఒకటి. అయితే మా

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 06:45 PM IST

సాధారణంగా చాలామంది ఇంట్లో అనేక రకాల జంతువులను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది పెంచుకునే జంతువులలో కుక్క కూడా ఒకటి. అయితే మామూలుగా మనం ఇంట్లో పెంచుకునే కుక్కలకు గాని లేదంటే బయట వేరే వాళ్ళ పెంచుకునే కుక్కలు వీధి కుక్కలకు నాలుక అన్నది సుమారు ఒక ఐదు సెంటీమీటర్లు ఉంటుంది. కొన్ని కుక్కలకు అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. అదికూడా ఒకటి లేదా రెండు సెంటీమీటర్లు తక్కువ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక్క కుక్క మాత్రం ఏకంగా పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డును సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలో ఒక కుక్కకు నాలుక ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉంది. తాజాగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. అయితే ఇప్పటికే 9.49 సెంటీ మీటర్లతో బెస్బీ అనే కుక్క పేరుతో ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. ఆ కుక్క పేరు జోయ్. దాని యజమాని సాడీ, విలియమ్స్‌. వారికి ఈ కుక్క ఆరు వారాల వయస్సులో ఉన్నప్పుడు దొరికింది. సాధారణంగానే జోయ్ నాలుక ఎలాస్టిక్ మాదిరిగా నోటి బయటికి సాగి ఉండేది.

Us Dog

పెరిగే కొద్దీ అందరూ ఆ కుక్కపైనే కామెంట్ చేసేవారు వారు తెలిపారు. జోయ్‌కి బయట తిరగడం, బాల్స్‌తో ఆడుకోవడం, పక్క కుక్కలతో గొడవపడడం, కారు వెంట పరుగెత్తడం, ఈత కొట్టడం అంటే ఇష్టమని వాళ్లు తెలిపారు.తమ చుట్టుపక్కల జోయ్ అంటే తెలియనివారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు అని తెలిపారు.

 

మేము వాకింగ్‌కు జోయ్‌ను తీసుకువెళితే అందరూ మా దగ్గరికే వస్తారు. దానిని తాము పెంచుకుంటాం ఇవ్వమని అడుగుతారు. దీనిపై మేము చాలా సార్లు హెచ్చరించాము. జోయ్‌కి కోపమొస్తే కరిచిన సందర్భాలు కూడా ఉన్నాం అని యజమాని వెల్లడించారు. అలాగే తన ప్యాంటుకు ఉన్న జోయ్ పంటి గాట్లను చూపిస్తూ విలియమ్స్ చిరునవ్వుతో తెలిపారు. ప్రస్తుతం ఆ కుక్కకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.