మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లా దేవ్ర గ్రామంలో నీటి ఎద్దడి కుటుంబాలను విడదీస్తుంది. గ్రామంలో తీవ్ర స్థాయిలో నీటి కొరత ఉండటంతో, ఓ మహిళ తన భర్తను వదిలేసి పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయిన (UP Woman Leaves Husband)ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దేవ్ర గ్రామం (Deoria Village ) జిల్లా కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నీటి సౌకర్యాల పరిస్థితి అత్యంత శోచనీయంగా ఉంది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క బోరుబావి వద్ద నీటి కోసం గ్రామస్తులు ఎండలో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంక్ ఉన్నా, దానికి సరైన నీటి సరఫరా లేదు. పైగా గ్రామంలో ఇంటి ఇంటికీ నల్లా కనెక్షన్లు సైతం లేవు. దీంతో ప్రతిరోజూ తాగునీటి కోసం గ్రామస్తులు తలపడ్డ పోరాటం గరిష్ఠానికి చేరుతోంది.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన!
తాగునీటి సమస్యను భరించలేని స్థితిలో జితేంద్ర సోని అనే కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి భార్య, పిల్లలను తీసుకుని ఇంటిని వదిలి వెళ్లిపోవడం పట్ల స్థానికంగా విషాదం నెలకొంది. జితేంద్ర భార్య మాట్లాడుతూ.. భవిష్యత్తు లేని గ్రామంలో పిల్లల చదువు, ఆరోగ్యం బాగుపడదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని జితేంద్ర జిల్లా అధికారులకు తెలియజేయడంతో, వారు వెంటనే స్పందించి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాల్సిందిగా ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖకు (PHE) ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన మానవ జీవనానికి నీటి అవసరం ఎంత ముఖ్యమో నిరూపించింది.