Site icon HashtagU Telugu

Woman Beats Husband : కోర్టు బయటే భర్తను చెప్పుతో కొట్టిన భార్య

Woman Beats Husband

Woman Beats Husband

ఉత్తరప్రదేశ్‌లో ట్రిపుల్‌ తలాక్‌ (Triple Talaq) ఘటన మరోసారి సంచలనంగా మారింది. భరణం కేసు విచారణ అనంతరం కోర్టు బయట భర్త తన భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళ ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తను చితకబాదింది. ఈ సంఘటన రాంపూర్‌ కోర్టు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకోగా, అక్కడి ప్రజలు చూసిన దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

YSR తెచ్చిన పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది – KTR

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో ఆమె వివాహం జరిగింది. పెళ్లి అనంతరం నుంచి భర్త అదనపు కట్నం కోసం వేధించడం, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టి, పిల్లలను బలవంతంగా లాక్కెళ్లాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో భరణం కోసం కోర్టులో కేసు వేసిన ఆమె విచారణకు హాజరైన సమయంలోనే ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

“నా భర్త, మామ కలిసి నాపై దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం వారిపై చేయి చేసుకోవాల్సి వచ్చింది. నా పిల్లలను దూరం చేశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు తలాక్‌ చెప్పి మళ్లీ దాడి చేశారు. నాకు న్యాయం కావాలి, నా కుమార్తెలను తిరిగి అప్పగించాలి. నిందితులకు కఠిన శిక్ష పడాలి” అని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.