Police Bike Stunts: పోలీస్ యూనిఫామ్ లో బైక్ పై స్టంట్స్.. అధికారులు ఏం చేశారో తెలుసా?

దేశవ్యాప్తంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు కారణంగా పదుల సంఖ్యలో మరణిస్తున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం అతివేగం. అతివేగం కారణంగా చాలామంది వ

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 04:20 PM IST

దేశవ్యాప్తంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు కారణంగా పదుల సంఖ్యలో మరణిస్తున్న విషయం తెలిసిందే. అందుకు గల కారణం అతివేగం. అతివేగం కారణంగా చాలామంది వారి ప్రాణాలను పణంగా పెట్టడంతో పాటు పక్క వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. ప్రమాదకరంగా రోడ్డు మీద బైకులతో స్టంట్ లు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.. పోలీసులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని పిలుస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాల విషయం గురించి అవగాహన కల్పించాల్సిన పోలీసులే నిబంధనలను అతిక్రమిస్తున్నారు.

తాజాగా కూడా ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్‌లో ఒక కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తూనే బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫాంలో ఉండి స్టంట్స్ చేసినందుకు ఉన్నతాధికారులు అతడ్ని వెంటనే సస్పెండ్‌ చేశారు. కాగా సందీప్‌ కుమార్‌ చైబే గోరఖ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా పోలీస్‌ యూనిఫాంలో ఉన్న సందీప్ చౌబే రేసింగ్ బైక్‌పై రోడ్డుపై విన్యాసాలు చేశాడు.

మరొకరితో వీడియో తీయించి ఆ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ రీల్‌లో నీకు శత్రువులంటే భయం లేదా? అని ఒక అమ్మాయి అడగ్గా..శత్రువులు అంటే భయం ఎందుకు? చావు అంటే ఏంటి? ఈరోజు కాకపోతే రేపైనా మనం చనిపోతాం. భయపడాలంటే దేవుడికి భయపడండి. కీటకాలు, స్పైడర్లకు ఎందుకు భయపడతారు? అని సదరు కానిస్టేబుల్‌ జవాబిస్తాడు. కానిస్టేబుల్‌ సందీప్‌ కుమార్‌ చైబే ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పోలీసులు తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయొద్దని ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వును ఉల్లంఘించిన కానిస్టేబుల్ సందీప్ చౌబేపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడ్ని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.