Uk: అరుదైన ప్రయోగం సక్సెస్.. ముగ్గురు డిఎన్ఎలతో జన్మించిన శిశువు?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అయినప్పటికీ

  • Written By:
  • Publish Date - May 10, 2023 / 04:23 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అయినప్పటికీ మరి కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నారు. తాజాగా కూడా బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో సక్సెస్ ను సాధించారు. బ్రిటన్ లో మొట్టమొదటిసారి ఒక శిశువు ముగ్గురి డిఎన్ఏ లతో జన్మించింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అయితే ఇందులో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇందులో 99.8% తల్లిదండ్రులకు కాగా మిగిలిన ఆ శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటో కాండ్రియల్ డోనేషన్ ట్రీట్‌మెంట్‌ గా పేరు పెట్టారు. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలాన్ని ఉపయోగించి ఐవీఎఫ్‌ పిండాలను సృష్టిస్తారు.

తద్వారా పిల్లలకు తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు. కాగా మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి అన్న విషయం తెలిసిందే. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా చేస్తున్నారు. కాగా ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్‌ఏ లను కలిగి ఉంటుంది.

అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి. అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్‌కు చెందిన ఒక జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.