Site icon HashtagU Telugu

Video Viral: ఢిల్లీ మెట్రోలో మరోసారి రెచ్చిపోయిన మహిళలు.. వీడియో వైరల్?

Two Women Hit Each Other Ugly Fight Inside Delhi Metro

Two Women Hit Each Other Ugly Fight Inside Delhi Metro

ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో ట్రైన్ లో వింత వింత ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. వారంలో కనీసం నాలుగు అయిదు ఘటనలు ఢిల్లీ మెట్రో ట్రైన్ లోనే చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు ఢిల్లీ మెట్రో అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.. ఇంత వింత సంఘటనలు చూడచేసుకుంటున్న కూడా ఢిల్లీ మెట్రో అధికారులు అసలు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక వ్యక్తి మైనర్ బాలికను చూసి మెట్రో ట్రైన్లు అందరూ చూస్తుండగానే హస్తప్రయోగం చేసిన విషయం తెలిసిందే.

అటువంటి ఘటనలపై స్పందించిన మెట్రో ట్రైన్‌ అధికారులు అభ్యంతరకర, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే చేష్టలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌​ ఇచ్చారు. అధికారులు వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అధికారుల మాటలు లెక్కచేయకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఢిల్లీ మెట్రో ట్రైన్ లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెట్రో రైలు కోచ్‌లో ఇద్దరు మహిళలు పోట్లాడుకున్నారు.

 

బ్లాక్‌, ఎల్లో డ్రెస్‌లు ధరించిన ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరినొకరు బట్టలు, జుట్టు లాగుతూ కొట్టుకున్నారు. వీరిలో బ్లాక్‌ డ్రెస్‌ ఆమె రెచ్చిపోయి ప్రవర్తించింది. అక్కడే ఉన్న ఒక మహిళ పోలీస్‌ అధికారి, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అంతేగాక నేను జడ్జి కూతుర్ని, నిన్ను నేను వదిలిపెట్టను అంటూ పోలీస్‌ను హెచ్చరించింది సదరు మహిళ. మరో మహిళ తాను ఏం తప్పు చేయలేదని ఎవరిపై శారీరకంగా దాడి చేయలేదని తెలిపింది. అయినా న్యాయమూర్తి కుమార్తెను అంటూ చెప్పుకుంటున్న మహిళ తగ్గకుండా తన హోదాను అడ్డుపెట్టుకొని వీరంగం సృష్టించింది. చివరికి స్టేషన్‌ రావడంతో ఇద్దరిని మెట్రో దిగి వెళ్లాలని పోలీస్‌ అధికారి సూచించడంతో వారు వెళ్లిపోయారు. నల్ల రంగు దుస్తులు ధరించిన మహిళ తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. అయితే సదరు మహిళపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.