Site icon HashtagU Telugu

Bihar: ఇదేందయ్యా ఇది.. టూ వీలర్ పై సీటు బెల్ట్ పెట్టుకోలేదని రూ. 1000 జరిమానా?

Bihar

Bihar

ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు అలాగే సీటు బెల్ట్ పెట్టుకోనందుకు జరిమానాన్ని విధిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కారు వంటి వాహనాలు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఆ ప్రమాదల బారి నుంచి మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. అయితే మామూలుగా కార్లు వంటి వాహనాలు సీటు బెల్టు పెట్టుకోకపోతే జరిమానా విధిస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఒక ట్రాఫిక్ టూవీలర్ వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోలేదంటూ చలానా విధించారు. టు వీలర్ ఏంటి సీట్ బెల్ట్ ఏంటి అనుకుంటున్నారా, మీరు విన్నది నిజమే.

ఈ సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లో ఒక ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాఫిక్ చలానా కట్టమంటూ ఒక మెసేజ్ వచ్చిందట. 2020లో ట్రాఫిక్ ఉల్లంఘన కారణంగా సమతి పూర్ లో ఈ ఘటన జరిగిందని ఇప్పటికీ చలాన్ జమ అయినట్లు తెలిసిందని వాహనదారుడు కృష్ణ కుమార్ ఝా తెలిపారు. 2020 లోని చలానా మెసేజ్ ఇప్పుడు వచ్చినట్లు ఆయన తెలిపారు. అది కూడా టూవీలర్ వాహనంపై సీట్ బెల్ట్ ధరించలేదని ఆ మెసేజ్ లో ఉన్నట్లు అతని పేర్కొన్నాడు. నా దగ్గర ఒక స్కూటీ ఉంది. నేను ఏప్రిల్ 27న బెనారస్ వెళ్తున్నాను. నేను రైల్లో ఉన్నప్పుడు నా పేరు పై వెయ్యి రూపాయలు చలాన్ జారీ చేయబడిందని నాకు ఒక మెసేజ్ వచ్చింది.

ఆ వివరాలను చూసినప్పుడు 2020 అక్టోబర్ లో సీటు బెల్టు ధరించనందుకు అని పేర్కొన్నారు అంటూ వాహనదారుడు వెల్లడించారు. అయితే ఆ మెసేజ్ చూసి ఆ వాహనదారుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట. టుటూ వీలర్ నడిపితే సీట్ బెల్ట్ చలానా రావడం ఏంటి అని ఆశ్చర్యపోయిన అతను ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించగా ఏదో ఒక లోపం కారణంగా చలానా రూపొందించబడి ఉండవచ్చు అని ట్రాఫిక్ పోలీసులు తెలిపినట్లు అతడు తెలిపాడు. ఈ విషయంపై స్పందించిన బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ లోపం ఎక్కడ జరిగిందో అతనికి చేస్తాను అని తెలిపారు.