Flights Safe Land: గాలిలో అంతరాయం.. తృటిలో రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం?

ఈ మధ్యకాలంలో కేవలం రోడ్డుపై వాహనాలు మాత్రమే కాకుండా గాల్లో ఎగురుతున్న విమానాల పరిస్థితి కూడా అంతంత

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 06:49 PM IST

ఈ మధ్యకాలంలో కేవలం రోడ్డుపై వాహనాలు మాత్రమే కాకుండా గాల్లో ఎగురుతున్న విమానాల పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో గాల్లో విమానాలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో వెంటనే పైలెట్ లు ప్రమాదాన్ని గమనించి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నారు. ఒక రెండు విమానాలు గాలిలో ఉన్న సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఆ రెండు ఫ్లైట్లు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. అదృష్టవశాత్తు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి..

మొదట ఒక విమానం నేపాల్ రాజధాని కాట్ మాండు నుంచి 150 మంది ప్రయాణికులతో దుబాయ్ కి బయలుదేరింది. కాగా దుబాయ్ కి చెందిన ఫ్లైధు బాయ్ విమానం ఖాట్మండు లోని త్రిబువన్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి దాని రెండు ఇంజిన్ ల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన అధికారాలు విమానాన్ని తక్షణమే ల్యాండ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇండికేటర్లు అన్నీ కూడా సాధారణంగా ఉండడంతో పైలెట్లు విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లారు.

 

వెంటనే ఆ సమాచారాన్ని కంట్రోల్ టవర్ కి అందించగా ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం అందులో 150 మంది ప్రయాణికులు ఉండగా అందులో సుమారు 50 మంది నేపాలి వారు మిగిలిన వారు ఇతర దేశాలకు చెందిన వారు అని తెలిపారు అధికారులు. ఇక మరో ఘటన గురించి మాట్లాడుకుంటే అమెరికాలో ఒక విమానం గాలిలోకి ఎగిరిన కొద్ది క్షణాల్లోనే దాని ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఒక పక్షి ఢీకొనడం వల్ల ఆ ప్రమాదం సంభవించింది. తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కొలంబస్ లోని జాన్ గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయ్యింది. కొద్దిసేపటికి పచ్చి ఢీకొనడంతో ఇంజన్ నుంచి మంటలు ప్రారంభం కాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెనక్కి తిప్పి కొలంబస్ లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులను మరొక ఫ్లైట్ లో ఎక్కించి వారి గమ్యస్థానానికి చేర్చారు.