అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి ముందు తన భార్య మెలానియా(Melania)కు ముద్దు (Kiss) ఇవ్వబోయారు. కానీ ఆమె పెట్టుకున్న టోపీ అడ్డురావడంతో టచ్ లేకుండానే ముద్దు పెట్టారు. దీంతో కిస్ మిస్ అయ్యిందంటూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Trumps First Speech : ప్రవాస భారతీయులకు షాక్.. ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. కార్యక్రమానికి భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం విశేషం. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసాడో లేదో..అప్పుడే భారతీయులకు షాక్ ఇచ్చాడు.ఇప్పటివరకూ అమెరికాలో ఉంటున్న విదేశీయులకు.. అమెరికాలో పిల్లలు పుడితే.. వారు ఆటోమేటిక్‌గా ఆ దేశ పౌరులు అయిపోతారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ఈ విషయాన్ని చెబుతోంది. ఇది 150 ఏళ్లకు పైగా ఉన్న విధానం. ఇప్పుడు ట్రంప్ దీనికి గుడ్‌బై చెప్పారు. ఇకపై విదేశీయులకు అమెరికాలో పిల్లలు పుడితే.. వారికి ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభించకుండా ఈ చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు.
Trump tried to kiss Melania at the 60th Presidential Inauguration, but her hat had other plans. pic.twitter.com/w1kaXk4oxj
— Rio (@mario_balkans) January 20, 2025