Site icon HashtagU Telugu

Truecaller CEO-Trolled Woman :  ఇండియాను వదిలేస్తానన్న స్టూడెంట్.. ట్రూకాలర్ సీఈఓ జాబ్ ఆఫర్

Truecaller Ceo Trolled Woman

Truecaller Ceo Trolled Woman

Truecaller CEO-Trolled Woman : కెనడాలో భారత స్టూడెంట్  ఏక్తా చేసిన కామెంట్ పై హాట్ డిబేట్ నడుస్తోంది.

“ఇండియాను వదిలేసి.. విదేశాల్లో జాబ్ వెతుక్కొని సెటిలై పోవడమే నా  జీవిత ఆశయం”  అని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.. 

దీనిపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అభిప్రాయం సరికాదని చాలామంది ఏక్తాకు హితవు పలికారు. 

ఈనేపథ్యంలో ట్విట్టర్ లో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న భారత్ కు చెందిన బయోటెక్నాలజీ  స్టూడెంట్  ఏక్తాకు అండగా  ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెది రంగంలోకి దిగారు.  ఆమె వాదనను  సపోర్ట్ చేయడంతో పాటు జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు. చదువు పూర్తయిన తర్వాత ప్రపంచంలో ట్రూకాలర్ ఆఫీసుల్లో ఎక్కడ అడిగితే అక్కడ ఏక్తాకు నేరుగా జాబ్ పోస్టింగ్ ఇస్తామంటూ ఆయన ట్వీట్ చేశారు.   

Also read : Bro Daddy : చిరంజీవి కొడుకుగా శర్వానంద్..?

“ప్రజలు ఏక్తాకు అపార్థం చేసుకొని ఎగతాళి చేస్తున్నారు. ఇది సరికాదు!! ఏక్తా.. నువ్వు ఈ ట్రోలింగ్స్ ను పట్టించుకోకు. నువ్వు కూల్‌గా.. నీ సొంత కలల ప్రపంచంలో జీవిస్తున్నావని నేను భావిస్తున్నాను! నీ చదువు  పూర్తి కాగానే..  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రూకాలర్ ఆఫీసులలో  దేనిలోనైనా పని చేయడానికి రావచ్చు.. నీకు స్వాగతం” అని ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెది(Truecaller CEO-Trolled Woman)  పేర్కొన్నారు. దీనిపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ట్రూకాలర్ సీఈఓను సపోర్ట్ చేశారు. ఇంకొందరు  ఆయన వైఖరిని తప్పుపట్టారు. ఇండియా నుంచి వెళ్లిపోవాలనే వాళ్లకు ఇలా గుడ్డిగా సపోర్ట్ చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Also read : Black Tiger : ఆ అడవిలో బ్లాక్ టైగర్ హల్ చల్.. వీడియో వైరల్