Site icon HashtagU Telugu

Tomato : టమాటాలతో తులాభారం.. మాములుగా లేదుగా టమాటా రేంజ్..

Tomato Tulabharam in Anakapalli Nukalamma Temple goes viral

Tomato Tulabharam in Anakapalli Nukalamma Temple goes viral

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా టమాటా(Tomato) గురించే వినపడుతుంది. టమాటా రేటు ఒక్కసారిగా 150 దాటింది. కొన్ని చోట్ల 200 రూపాయలు కూడా పలుకుతుంది. దీంతో సామాన్యులకు టమాటా భారమైనా రోజు ఏదో ఒక వార్తతో వైరల్ అవుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తన కూతురికి టమాటాలతో తులాభారం వేయించాడు.

అనకాపల్లి(Anakapalli)లో నూకాలమ్మ ఆలయంలో పలువురు భక్తులు బెల్లంతో, వివిధ వస్తువులతో తులాభారం వేసి వాటిని ఆలయానికి అప్పగిస్తారు. ఆ వస్తువులు ఆలయ అధికారులు అన్నదానంలో వాడతారు. అనకాపల్లికి చెందిన అప్పారావు అనే వ్యక్తి తన కూతురు భవిష్యకు తగ్గ బెల్లం తులాభారం ఇస్తానని మొక్కుకున్నాడు. అయితే ఏమనుకున్నాడో ఏమో బెల్లంతో పాటు టమాటాలు కూడా తులాభారం వేయించాడు. తులాభారంలో ఏకంగా 51 కిలోల టమాటాలు తూగాయి.

బెల్లంతో పాటు ఆ టమాటాలు కూడా ఆలయ అధికారులకు అప్పగించాడు ఆ భక్తుడు. వాటిని అన్నదానంలో వాడతామని ఆలయ అధికారులు ప్రకటించారు. గుడికి వచ్చిన భక్తులంతా ఆ టమాటా తులాభారాన్ని ఆసక్తిగా చూశారు. ఇక ఈ వార్త వైరల్ గా మారింది. ఏకంగా ఇప్పుడున్న రేట్లకి టమాటాలతోనే తులాభారం వేయించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

 

Also Read : Tomato: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కిలో టమాటా 80 రూపాయల చొప్పున అందుబాటులోకి..!