Tigers Fight: తగ్గేదేలే.. జింక కోసం టైగర్స్ భారీ ఫైటింగ్, చక్కర్లు కొడుతున్న వీడియో!

రెండు పులులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఇదిగో వెంటనే ఈ వీడియోను చూసేయ్యండి.

Published By: HashtagU Telugu Desk
Tigers

Tigers

ప్రేమ, కోపం, ఆప్యాయత మనుషులకే కాదు.. జంతువులకు (Animals) ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు తమలోని ఎమోషన్స్ ను బయటకు తీస్తాయి. అప్పుడు తోటి జంతువు అయినా తగ్గేదేలే అంటూ ప్రవర్తిస్తాయి. అడ్డొస్తే ఫైట్ చేసేందుకు కూడా వెనుకాడవు.  అందుకు ఫర్ఫెక్ట్ ఉదాహారణ ఈ వీడియో. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఒక ఆడపులికి రోడ్డుపై జింక కనబడుతుంది. ఇంకేముంది వెంటనే దాన్ని మెడను నోట కరచుకొని తీవ్ర గాయాలు చేసింది. ఆ తర్వాత నిస్సాహాయ స్థితిలో జింకను ఆహారంగా తినేందుకు ముళ్లపొదల్లోకి లాక్కేందుకు ప్రయత్నిస్తుంది.

అయితే అదే సమయంలో మగ పులి (Male Tiger) ఎంట్రీ ఇస్తుంది. క్షణాల్లోనే జింకను తింటున్న ఆడపులిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆడ పులి ఎంతకు తగ్గకపోవడంతో రెండు పులులు హోరాహీరోగా కొట్టుకుంటాయి. సినిమాలో హీరో, విలన్ ఏవిధంగా కొట్టుకుంటారో ఇంచుమించు అలానే ఫైట్ చేశాయి. అయితే చివరకు చేసేదేమీ లేక ఆడపులి అక్కడ్నుంచీ జారుకుంటుంది. దీంతో మగ పులి భోజనంగా జింకను తినేస్తుంది.

ఈ ద్రుశ్యం రణథంబోర్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన పర్యాటకులు (Tourists) ఆ ద్రుశ్యాలను బంధించారు. వేట కోసం పులికి, పులికి మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియో చక్కర్లు (Viral) కొడుతోంది. ప్రతిఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివకు 8.6 లక్షల మంది చూశారు. అద్బుతం రెండు పులులు కొట్టుకోవడం భలే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు నేను రాలేను: జూనియర్

  Last Updated: 20 May 2023, 03:10 PM IST