Tigers Urine For Sale : పులి మూత్రం 250 గ్రాములకు ధర ఎంతో తెలుసా ? ఏకంగా రూ.600!! ఒక జూలో పులి మూత్రాన్ని అమ్మేస్తున్నారు. జనం దాన్ని ఎగబడి కొంటున్నారు. ఇంతకీ ఎక్కడ ? పులి మూత్రంతో ఏం చేస్తారు ? అనేది తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
Also Read :Deep Seek AI : అమెరికాకు చైనా ‘డీప్ సీక్’ కలవరం.. డౌన్‌లోడ్లలో నంబర్ 1.. ఎలా ?
ఎక్కడ ?
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ‘ది యాన్ బిఫెంగ్ షియా’ పేరుతో ఒక జూ(Tigers Urine For Sale) ఉంది. ఈ జూలో పులి మూత్రాన్ని డబ్బాల్లో ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టారు. 250 గ్రాముల పులి మూత్రం బాటిల్‌పై రూ.600 అని రేటును స్పష్టంగా రాశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై తీరొక్క రకంగా చర్చించుకుంటున్నారు.
Also Read :Kris Gopalakrishnan : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకు ?
ఎందుకు ?
పులి మూత్రంలో వైట్ వైన్‌ను కలిపి తాగితే ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుందని చైనా ప్రజలు నమ్ముతారట. పులి మూత్రం బాటిల్‌పై రాసిన వివరాల ప్రకారం.. దాన్ని వినియోగిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఎక్కడైనా కండరాల్లో బెణుకులు ఉంటే తొలగిపోతాయి. అల్లం ముక్కల ద్వారా పులి మూత్రాన్ని తీసుకొని శరీరంలో నొప్పులు ఉన్న కండర భాగాల్లో మసాజ్ చేసుకోవాలని ఆ బాటిల్‌పై రాశారు. వైట్ వైన్‌ను కలిపి పులిమూత్రాన్ని నేరుగా తాగినా ఇబ్బందేం ఉండదని అందులో ప్రస్తావించారు. ఒకవేళ అలర్జీ ఏదైనా తలెత్తితే వెంటనే దాని వినియోగాన్ని ఆపేయాలనే వార్నింగ్‌ను కూడా పులి మూత్రం బాటిల్‌పై పొందుపరిచారు.
ఎలా ?
‘ది యాన్ బిఫెంగ్ షియా’ జూలో పెద్దసంఖ్యలో పులులు ఉన్నాయి. ఈ జూలోని పులులు ప్రతిరోజూ ఒక నిర్ణీత ప్రదేశంలోని తటాకంలో మూత్రం చేస్తాయి. అందులో నుంచి ప్రతిరోజూ ఒకసారి మూత్రాన్ని సేకరించి దాచేస్తారు. అయితే విక్రయించే ముందు పులి మూత్రాన్ని క్రిమిరహితంగా మారుస్తారా ? లేదా ? అనేది తెలియరాలేదు.పులి ఎముకలతో మూర్ఛరోగం, రుమాటిజం వంటి ఆరోగ్య సమస్యలను నయం చేయొచ్చని చైనా వైద్య గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. అయితేే పులి ఎముకల వినియోగంపై చైనాలో నిషేధం ఉంది. మొత్తం మీద కుక్క మాంసం తినడం దగ్గరి నుంచి పులి మూత్రం తాగే దాకా చాలా స్పెషాలిటీలు చైనీయులకే ఉన్నాయని మరోసారి నిరూపించుకున్నారు.