Tiger Cubs: తల్లిపులిని ఫాలో అవుతున్న పులి పిల్లలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే?

సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో దేశ నలుమూలలు ఏం జరుగుతున్నా కూడా వెంటనే చేతిలో ఉన్న మొబైల్స్ ద్వారా చూస్తున్నాం.

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 07:17 PM IST

Tiger Cubs: సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో దేశ నలుమూలలు ఏం జరుగుతున్నా కూడా వెంటనే చేతిలో ఉన్న మొబైల్స్ ద్వారా చూస్తున్నాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అందరికీ చేరుతున్నాయి. ఇక మానవులకు సంబంధించిన వీడియోలే కాకుండా మూగజీవులకు సంబంధించిన వీడియోలు కూడా బాగా హల్ చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే క్రూర మృగాలకు, ఇతర జంతువులకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లలో, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో లైవ్ లో జరిగేటివి కూడా చూస్తున్నాం. అయితే చాలామంది ఫారెస్ట్ అధికారులు జంతువులకు సంబంధించిన వీడియోలు పంచుకుంటూ ఉంటారు. అందులో జంతువులు చేసే విన్యాసాలు, ఫైటింగులు ఇతర యాక్షన్ లను వెంటనే కెమెరాలో బంధించి అందరికీ పంచుకుంటారు.

ఇప్పటికి చాలామంది ఫారెస్ట్ అధికారులు పెద్ద పెద్ద పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు పంచుకొని జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అని చెప్పాలి. చాలామంది జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలే కాదు పెద్దలు సైతం అడవిలో జంతువులు చేసే పనులు చూస్తూ ఉండిపోతూ ఉంటారు.

అయితే తాజాగా ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేసుకున్నాడు. అందులో పులి తన నలుగురు పిల్లలతో కలిసి ఉండడాన్ని చూడవచ్చు. అందులో తల్లి పులి ఎక్కడికెళ్తే ఆ నాలుగు పులి పిల్లలు కూడా తల్లి వెంబడే పరిగెడుతున్నాయి. అంటే తల్లి అడుగుజాడల్లో పిల్లలు నడుస్తున్నాయని అర్థం. మానవులే కాదు జంతువులలో కూడా తల్లి పిల్లల అనుబంధం ఉంటుందని ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూడ్డానికి బాగుంది అని అంటున్నారు.