Three Elephants Dies: ఉత్తర బెంగాల్‌లో గూడ్స్ రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్ జిల్లాలో విషాదం నెలకొంది. రాజభట్ ఖావా వద్ద సోమవారం ఉదయం గూడ్స్ రైలు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాద ఘటనలో తల్లి మరియు రెండు పిల్ల ఏనుగులు మరణించాయి.

Three Elephants Dies: పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్ జిల్లాలో విషాదం నెలకొంది. రాజభట్ ఖావా వద్ద సోమవారం ఉదయం గూడ్స్ రైలు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాద ఘటనలో తల్లి మరియు రెండు పిల్ల ఏనుగులు మరణించాయి. సోమవారం ఉదయం రాజభట్ ఖావా వద్ద మూడు ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా సిలిగురికి వెళ్లే రైలు ఢీకొన్నట్లు రాష్ట్ర అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.దీంతో రైల్వే మరియు రాష్ట్ర అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు ఇంజిన్‌ను పరీక్షల నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్‌లు మద్యం మత్తులో ఉన్నారా అన్న దానిపై వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు.ఈ ఏడాది ఆగస్టులో పశ్చిమ బెంగాల్‌లో ఓ గర్భిణీ ఏనుగు రైలు ఢీకొని మరణించింది.

Also Read: Telangana Elections 2023: తగ్గిన అక్బరుద్దీన్ ఆస్తులు..పెరిగిన 90 మంది ఎమ్మెల్యేల ఆస్తులు