Site icon HashtagU Telugu

Wedding Ceremony: పెళ్లికి వచ్చి చేతి వాటం చూపించిన దొంగ.. వధువు నగలు,నగదుతో పరార్?

38 Lakh Weddings

Wedding Ceremony

సాధారణంగా ఎవరైనా పెళ్లికి పిలిస్తే పెళ్లికి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి గిఫ్ట్ ఏదైనా తీసుకుని వెళ్తే వాళ్లకు ఇచ్చేసి వెళ్తాము. మహా అయితే బాగా తెలిసిన వాళ్లు అయితే అక్కడే ఉండి మాట్లాడించి వెళ్ళిపోతాం. కానీ ఒక దొంగ మాత్రం పెళ్లికి వచ్చి పెళ్లి వాళ్లు పెట్టింది తిని ఆఖరికి చేతివాటం చూపించాడు. పెళ్లి పనుల్లో ఎవరికివారు పనుల్లో నిమగ్నం అవ్వగా అదే అదునుగా భావించిన దొంగ ఏకంగా వధువు నగలు నగదు మొత్తం దోచుకెళ్లాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ షాకింగ్ ఘటన నాగపూర్ లో చోటు చేసుకుంది.

నాగపూర్ లోని న్యూ కమతి పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్గావ్ లో నివాసం ఉంటున్న వసంత్ కట్కర్ అనే వ్యక్తి కుమార్తె వివాహం జరిగింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథుల నుంచి వచ్చిన డబ్బులు నగదును పెళ్లికూతురు కూర్చున్న పక్క సీటుపై పెట్టారు. ఆ తర్వాత ఎవరికి వారు పెళ్లి పనుల్లో నిమగ్నం అయిపోయారు. అప్పుడు పెళ్లి వారు పట్టించుకోకపోయేసరికి దొంగలు దాని అవకాశంగా భావించారు. కళ్యాణ మండపంలో అందరూ ఉన్నా కూడా ఎవరూ చూడకుండా అందరి కళ్ళు కప్పి డబ్బులు, నగలు ఎత్తుకెళ్లారు. అయితే పెళ్లి వేడుకల నుంచి కాస్త రిలాక్స్ అయిన కుటుంబ సభ్యులకు ఆ తర్వాత అసలు విషయం అర్థమైంది.

దాంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు మొత్తం వెతకగా ఎక్కడ కనిపించలేదు. పెళ్లికి వచ్చిన బంధువులను కూడా ఆరా తీశారు. కానీ సామాగ్రి ఎక్కడ లేకపోవడంతో ఒకసారిగా పెళ్లి వేడుకలో కలకలం నేర్పింది. వెంటనే సీసీ కెమెరాలు చూడగా ఒక దొంగ సామాగ్రిని తీసుకెళ్తున్నట్టు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను వెతికే పనిలో పడ్డారు. పెళ్లి వారు దాదాపుగా ఐదు లక్షలు 50 వేల రూపాయలు విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగపూర్ లో ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

Exit mobile version