Site icon HashtagU Telugu

Maharashtra: దొంగల్లో మంచి దొంగ, ఓనర్ మంచోడని తెలిసి..

Narayan Surve

Narayan Surve

Maharashtra: ముంబైలో ఓ విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నారాయణ్ సర్వే ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఎల్‌ఈడీ, ఇతర విలువైన వస్తువులను అపహరించాడు. ఈ సమయంలో దొంగ గదిలోని నారాయణ్ సర్వే ఫోటోను చూసి అతనికి సంబంధించిన జ్ఞాపికలను చూశాడు. దీన్ని బట్టి అది ఓ ప్రముఖ కవి ఇల్లు అని దొంగ తెలుసుకున్నాడు. దొంగ చాలా పశ్చాత్తాపపడ్డాడు. దొంగిలించిన వస్తువులన్నీ తిరిగి అక్కడే వదిలి వెళ్ళాడు.దీంతో సదరు దొంగపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దొంగల్లోకెల్లా మంచి దొంగ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

నారాయణ్ సర్వే మరాఠీ భాషలో ప్రసిద్ధ కవి. ఆయన సామాజిక కార్యకర్త కూడా. తన జీవితమంతా సమాజానికే అంకితం చేశారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సుజాత, ఆమె భర్త గణేష్ ఘరే ముంబైలో నివసిస్తున్నారు. అయితే వాళ్ళు కొడుకును కలవడానికి విరార్‌ వెళ్లారు. గత 10 రోజులుగా ఇల్లు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఇంటిని చూసి దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.అనుకున్నట్టే వస్తువులని సర్దేసి వెళ్తూ వెళ్తూ ప్రసిద్ధ కవి ఫోట్లు చూశాడు. దీంతో దొంగ చాలా నిరుత్సాహానికి గురై క్షమాపణలు కోరుతూ ఇంట్లో నోటును అంటించాడు. దొంగ ఓ చీటీని గోడకు అతికించి చోరీకి క్షమాపణలు చెప్పాడు. ఆదివారం సుజాత తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వచ్చిందని నేరల్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శివాజీ ధావలే చెప్పారు. ఈ సమయంలో ఇంట్లో ఓ చీటీ దొరికింది. పోలీసులు కేసు నమోదు చేశారు. లగేజీపై ఉన్న వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా నారాయణ్ సర్వే కవిత్వం మరియు రచనలు ముంబై పట్టణ కార్మికుల పోరాటాన్ని హైలైట్ చేస్తాయి. ఆయన ముంబైలో అనాథలా జీవించాడు. హెల్పర్‌గా, ఆవుల కాపరిగా, కూలీగా పనిచేశాడు. హోటళ్లలో పాత్రలు కడగడంతోపాటు ఇతరుల పెంపుడు కుక్కలను కూడా చూసుకున్నాడ. పట్టణ కూలీల పోరాటం ఆయన కవితల్లో, వ్యాసాల్లో కనిపిస్తుంది. అతను 2010 లో 84 సంవత్సరాల వయస్సులో మరణించాడు. మేరీ శబ్ద్, ఏక్ నయే ఘమ్సా మే, క్షమాపణ, పోస్టర్, ఉస్మాన్ అలీ, లెనిన్, ప్రదార్ నహీ దో ఆప్ మరియు రాయిటర్స్ పార్క్ అతని ప్రధాన కవితలు.

Also Read: Samantha : ‘ఆ రోజులు’ మళ్లీ రావొద్దంటూ సమంత ఎమోషనల్